Actress Charu Asopa: విడాకులు – నటనకు గుడ్‌బై చెప్పి బట్టలు అమ్ముతున్న నటి

Tv Actress Charu Now Selling Clothes: సినీ, టీవీ సెలబ్రిటీలది లగ్జరీ లైఫ్ అనుకుంటాం. కోట్లలో డబ్బులు సంపాదిస్తూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంటారు. అయితే ఇది అందరి విషయంలో ఒకటి కాదు. కొందరు వరుస ఆఫర్స్ కోటీశ్వరులు అవుతుంటారు. మరికొందరు ఆఫర్స్ లేక రోడ్డున పడ్డవారు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రముఖ నటి ఆన్‌లైన్‌లో బట్టలు అమ్ముకుంటుంది. పైగా ఓ స్టార్ హీరోయిన్‌కి బంధువు కావడం గమనార్హం. నటి చారు అసోప గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె తెలుగులో నటించకపోయిన, వ్యక్తిగత జీవితంతో తరచూ వార్తల్లో నిలిచింది.
సుస్మిత సోదరుడితో పెళ్లి, విడాకులు
హిందీ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందిన చారు అసోప బాలీవుడ్ నటి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ మాజీ భార్య అనే విషయం తెలిసిందే. 2019లో చారు, రాజీవ్‌లకు పెళ్లయ్యింది. 2021లో వీరికి కూతురు కూడా పుట్టింది. అయితే కొంతకాలం అన్యోన్యంగా జీవించిన వీరి వైవాహిక జీవితంలో కలతలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత మనస్పర్థలను పక్కన పెట్టి కూతురి కోసం కలిసి జీవించాలి అనుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ, సడెన్‌గా విడాకులు ప్రకటన చేశారు. 2023లో తామిద్దరం విడిపోతున్నామంటూ జంటగా విడాకులను ప్రకటించారు. మరోవైపు చారుకి నటిగా అవకాశాలు కూడా తగ్గాయి.
పుట్టింటికి వెళ్లి బట్టలు అమ్ముతూ..
దీంతో ఆమె ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నటనను పక్కన పెట్టి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. ఆన్‌లైన్ బట్టలు అమ్ముతూ ఆర్థికంగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఆన్‌లైన్ తన బట్టలు ప్రమోషన్స్ చేస్తూ ఓ వీడియో బయటకు వచ్చింది. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. ఒకప్పుడు బుల్లితెర నటి సెలబ్రిటీ స్టేటష్‌లో ఉన్న ఆమె ఇప్పుడు ఆన్‌లైన్ బట్టలు అమ్ముకోవడం చూసి అంతా షాక్ అవుతున్నారు. కాగా విడాకుల తర్వాత చారు తన కూతురితో కలిసి తన సొంతూరు రాజస్థాన్ వెళ్లిపోయింది. అక్కడ బికనీర్‌లోని తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంది. అయితే తాను ఆన్‌లైన్‌లో బట్టలు విక్రయించడంపై చారు స్పందించింది. ముంబైలో నెలవారి ఖర్చులు రూ. లక్షపైనే అవుతున్నాయి. తనకు ప్రస్తుతం అంత ఆర్థిక స్థోమత లేదని చెప్పింది. దీంతో అవి భరించలేక తన పుట్టింటికి వెళుతున్నట్టు చెప్పింది.