Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలకృష్ణ “భగవంత్ కేసరి” ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే ?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా చేస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
Bhagavanth Kesari : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా చేస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దాంతో తన విశ్వరూపాన్ని చూపించేందుకు బాలయ్య మరోసారి రెడీ అయ్యారని.. ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. విజయ దశమి కానుకగా ఈ మూవీ అక్టోబర్ 19న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచింది. తాజాగా మేకర్స్ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందింది. ఈ క్రమంలో అభిమానులకు మరో పూనకాలు తెప్పించే అప్డేట్ అందించారు. అక్టోబర్ 8న ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ రానుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Gear up for #BhagavanthKesari’s explosive extravaganza Like Never Before💥
TRAILER OUT ON OCT 8th❤️🔥
This time, beyond your imagination🔥
In Cinemas from October 19th😎#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @rampalarjun @sahugarapati7… pic.twitter.com/s5Dle3Cm79
— Shine Screens (@Shine_Screens) October 5, 2023