Published On:

The Raja Saab: ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ టీజర్‌ని వాడేసిన ట్రాఫిక్‌ పోలీస్‌.. డైరెక్టర్‌ మారుతి రియాక్షన్‌..!

The Raja Saab: ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’ టీజర్‌ని వాడేసిన ట్రాఫిక్‌ పోలీస్‌.. డైరెక్టర్‌ మారుతి రియాక్షన్‌..!

Hyderabad Traffic Police used The Raja Saab Telugu Teaser: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మోస్ట్ అవైయిటెడ్‌ మూవీ ‘ది రాజా సాబ్‌’. ఎంతోకాలంగా ఈ సినిమా అప్‌డేట్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ డైరెక్టర్‌ మారుతి ఏకంగా టీజర్‌ వదిలి మంచి కిక్‌ ఇచ్చాడు. ఇటీవల విడుదలైన ఈ టీజన్ ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన అందుకుంది. ప్రభాస్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చాలా కాలం తర్వాత వింటేజ్‌ ప్రభాస్‌ని చూశామంటూ ఫ్యాన్స్‌ అంతా డైరెక్టర్‌ మారుతికి థ్యాంక్స్‌ చెబుతున్నారు.

 

ప్రస్తుతం ఈ టీజర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. రికార్డు వ్యూస్‌తో టాప్‌ ట్రెండ్‌లో నిలిచింది. అయితే ఇందులో కొన్ని డైలాగ్స్‌ మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అసలే మన లైఫ్‌ అంత అంత మాత్రమే.. హాలో బండి కొంచం మెల్లగా.. అంటూ ప్రభాస్‌ చెప్పిన డైలాగ్‌ వివిధ రకాలుగా వాడేస్తున్నారు. ఈ డైలాగ్‌తో మీమ్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇక ఇప్పుడ ఏకంగా ట్రాఫిక్‌ పోలీసులే ఈ టీజర్‌ని వాడేసారు.

 

ఈ రాజా సాబ్‌ టీజర్‌లోని ప్రభాస్‌ డైలాగ్స్‌ని వాడుతూ ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీస్‌ ఓ స్పెషల్‌ వీడియో షేర్‌ చేసింది. ప్రభాస్‌ బిల్లా, సాహెలో స్పీడ్‌గా బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న ఫుటేజ్‌కి.. ‘ది రాజా సాబ్‌ టీజర్‌లో వాడిన హలో.. హలో.. బండి కొంచ మెల్లగా.. అసలు మన లైఫ్‌లు అంతంతా మాత్రమే’ అనే ఫుటేజ్‌ని తీసుకున్నారు. ఆ తర్వాత మిర్చిలో ప్రబాస్‌ స్లోగా బైక్‌ నడిపే ఫుటేజ్‌ని కూడా వాడారు. ఈ వీడియోకు ‘హలో.. హలో..! బండి కొంచెం మెల్లగా నడపండి డార్లింగ్‌’ అంటూ క్రేజీ క్యాప్షన్‌ ఇచ్చారు.

 

ఇక దీనికి ప్రచారం మైక్‌ ఎమోజీతో రెడ్‌ హార్ట్‌ ఎమోజీని కూడా జత చేసింది. ట్రాఫిక్‌ రూల్స్‌పై అవగాహన కల్పించేందుకు ది రాజాసాబ్‌ టీజర్‌ని వాడటంపై దర్శకుడు మారుతి ఆనందం వ్యక్తం చేశారు. తమ సినిమాను.. ఓ మంచి పనికి పాజిటివ్‌ మ్యానర్‌లో వాడటం చాలా ఆనందంగా ఉందని, తమ సినిమాను ఫుటేజ్‌ని వాడినందకు ధన్యవాదాలు తెలిపారు. ఇది చూసిన మీమర్స్‌.. రాజాసాబ్‌ టీజర్‌ని ఇలా కూడా వాడేస్తున్నారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులంత రకరకాలుగా స్పందిస్తున్నారు.