Hari Hara Veeramallu: ‘హరి హర వీరమల్లు’ రిలీజ్‌కి లైన్ క్లియర్.. వచ్చేది ఎప్పుడంటే..?

Hari Hara Veeramallu Completed VFX Work: ఎప్పుడో రిలీజ్ కావాల్సిన హరి హర వీరమల్లు మూవీ వాయిదా పడుతూ వస్తుంది. పలు వాయిదాల అనంతరం జూన్ 12న రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ, అనుకుండ మళ్లీ ఈ సినిమా వాయిదా పడింది. దీనికి పలు కారణాల వినిపిస్తున్నా.. మూవీ టీం మాత్రం వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తి కాలేదని చెప్పింది.
కానీ, థియేటర్ల ఇష్యూ, బయ్యర్స్ లేకపోవడం వల్లే వీరమల్లు అనుకున్న తేదీకి రాలేకపోయాడనేది విశ్వసనీయ సమాచారం. ఏదేమైన ఈ మూవీ పోస్ట్‌పోన్ అవ్వడంతో ఫ్యాన్స్ మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పటి వరకు వీరమల్లు కొత్త రిలీజ్ డేట్‌ని మాత్రం ప్రకటించడం లేదు. దీంతో వీరమల్లు విడుదల తేదీ కోసం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వారందరికి కాస్తా ఊరటని ఇచ్చే అప్‌డేట్ ఇచ్చింది వీరమల్లు టీం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తయినట్టు టీం వెల్లడించింది. ఏఐ స్టూడియో కంపెనీ వీరమల్లు వీఎఫ్‌ఎక్స్‌కి వర్క్ చేసినట్టు పేర్కొంది.
ఈ మేరకు టీంతో డైరెక్టర్ జ్యోతికృష్ణ దిగిన ఫోటోని షేర్ చేశారు. ఈ అప్‌డేట్ ఫ్యాన్స్ ఉత్సాహాన్ని నింపింది. ఇక వీరమల్లు మూవీ రిలీజ్‌కి లైన్ క్లియర్ అయ్యిందని, త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్ పూర్తయిందనే ప్రకటిస్తూనే ట్రైలర్ త్వరలోనే రాబోతున్నట్టు హింట్ ఇచ్చేసింది. ప్రతి ఫ్రేం సినిమాటిక్ ఎక్స్‌ప్రీరియన్స్ ఇస్తుందని, జ్యోతికృష్ణ విజనరి నెక్ట్స్ లెవల్లో ఉండబోతుందని హైప్ ఇచ్చింది.
ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా హరి హర వీరమల్లులో అద్భుతమైన విజువల్స్ ఉండబోతున్నాయని పేర్కొంది. చూస్తుంటే వీరమల్లు మూవీ జూలై నెలాఖరులో వచ్చేలా కనిపిస్తోంది. జూలై 18న అనుష్క ఘాటి మూవీ విడుదల కానుంది. కాబట్టి వీరమల్లు జూలై నెలాఖరున వచ్చే అవకాశం ఉందని సినీవర్గాల నుంచి సమాచారం. ఈలోపు ట్రైలర్ కట్ చేసి రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ నుంచి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు చూడాలి.
Visual Brilliance Unleashed!
@AlZahraStudio brings 2+ years of dedication to life with mind-blowing visuals for #HariHaraVeeraMallu
Every frame is a testament to cinematic ambition… powered by Director @amjothikrishna visionary touch!
Get ready to witness VFX like… pic.twitter.com/2IvjhEd2Yb
— Mega Surya Production (@MegaSuryaProd) June 11, 2025