IT Raids on Actor Arya: హీరో ఆర్య నివాసంలో ఐటీ సోదాలు..

IT Raids on Tamil Actor Arya Residence and Restaurants: కోలీవుడ్ హీరో ఆర్య నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారుఉ సోదాలు నిర్వహించారు. చెన్నైలోని అన్నానగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆయనకు సంబంధించిన రెస్టారెంట్లపై తనిఖిలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలు నేపథ్యంలో ఆర్యకు సంబంధించిన సీ షెల్ రెస్టారెంట్లతో పాటు ఆయన పూనమల్లి హై రోడ్‌లో ఉన్న ఆర్య నివాసంలోనూ ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు.
ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ హాట్ టాపిక్‌గా మారింది. కాగా గతంలో ఆర్య ఈ అరేబియన్ రెస్టారెంట్ చైన్ ప్రారంభించాడు. కొంతకాలనికి కున్హి మూసా అనే కేరళ వ్యాపారవేత్తకు వాటిని విక్రయించాడని సమాచారం. కేరళలో కున్హి మూసాకు సంబంధించిన ప్రాపర్టీస్‌పై ఐటీ అధికారులు నిఘా పెట్టారు.. ఆ విచారణలో భాగంగానే చెన్నైలో ఈ రెస్టారెంట్లు, ఆర్య నివాసంపై దాడులు జరుగుతున్నాయని స్థానిక మీడియా నుంచి సమాచారం. ఈ సందర్భంగా అధికారులు రెస్టారెంట్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, యాజమాన్య మార్పులకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టారు. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
నిజానికి ఆర్య కేరళకు చెందిన వ్యక్తి. అరిన్తుమ్ అరియామలుమ్ సినిమాతో తమిళ చిత్రంలో నటుడిగా వెండితెర ఆరంగేట్రం చేశాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో అతడు పూర్తి కోలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టాడు. వరుస ఆఫర్స్, హిట్స్ వస్తుండటంతో పూర్తిగా చెన్నైకి మాకాం మార్చాడు. ప్రస్తుతం ఆర్య ‘వెట్టువమ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. పా. రంజిత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక తన ఇల్లు, రెస్టారెంట్లపై జరుగుతున్న ఐటీ దాడులపై ఆర్య స్పందించాడు. ఈ మేరకు అతడు మీడియాతో మాట్లాడాడు. సీ షెల్ రెస్టారెంట్లతో ప్రస్తుతం తనకు సంబంధం లేదని, కొన్నేళ్ల క్రితమే ఈ హోటళ్ల నిర్వాహణ బాధ్యతను మరో వ్యక్తికి అప్పగించినట్లు స్పష్టంచేశాడు.