Kajol on Ramoji Film City: రామోజీ ఫిల్మ్ సిటీ.. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశం.. కాజోల్ షాకింగ్ కామెంట్స్!

Ramoji Film City Most Haunted Place said by Kajol: హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రత్యేకత గురించి చెప్పనవసరం లేదు. దేశంలోనే అతిపెద్ద షూటింగ్ స్పాట్ ఇది. అన్ని భాషలకు సంబంధించిన షూటింగ్ ఇక్కడ జరుగుతుంటాయి. బాలీవుడ్ సినిమా దర్శకులు సైతం షూటింగ్ లోకేషన్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీని ఎంచుకుంటారు. అంతటి ఖ్యాతి ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీపై బాలీవుడ్ నటి కాజోల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె నటించిన ‘మా’ సినిమా జూన్ 20న విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమెకు ఇక లైఫ్‌లో వెళ్లకూడదని అనుకునే ప్రదేశం ఏదైన ఉందా? అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ గతంలో రామోజీ ఫిల్మ్ సిటీలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. “అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. భయానకంగా అనిపించేది ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రాంతాలు షూటింగ్‌లు చేశాం. రాత్రిళ్లు అసలు నిద్ర పట్టేదే కాదు. ఇక్కడి నుంచి బయటపడగలమా అనిపించేది. దానికి ప్రత్యేక ఉదాహరణ రామోజీ స్టూడియోస్. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీకి ఎన్నోసార్లు షూటింగ్ వెళ్లాను. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన చోటు అది” అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఆమె ప్రస్తుతం వెబ్ సిరీస్, లేడీ ఒరియంటెడ్ సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఎన్నో కల్ట్ క్లాసికల్ హిట్స్ చిత్రాల్లో నటించారు. షారుక్ ఖాన్‌తో ఆమె నటించిన యూత్ ఫుల్ లవ్‌స్టోరీ ‘దిల్ వాలియా దుల్హానియా లే జాయేంగే’ మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇప్పటికి ఈ సినిమా అంటే చెవి కోసుకునేవారున్నారు. అలా కొన్ని దశాబ్దాలు ఇండస్ట్రీలో రాణిస్తున్న కాజోల్.. నటుడు అజయ్ దేవగన్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా స్టార్ నటిగా ఆమె కొనసాగుతుండం విశేషం. ఇక ఆమె తాజాగా నటించిన ‘మా’ చిత్రం హారర్ థ్రిల్లర్ స్టోరీ. ఇందులో భాగంగా ఆమె భయానకమైన ప్రదేశాల గురించి మాట్లాడుతూ.. రామోజీ ఫిల్మ్ సిటీపై కామెంట్స్ చేసింది.