Nayanatara @Mega157 Sets: మెగా 157 సెట్‌లో అడుగుపెట్టిన నయనతార.. ముస్సోరీ షూటింగ్, స్పెషల్ సాంగ్ కూడా!

Nayanthara Joins in Mega157 Movie Shooting: మెగాస్టార్ చిరంజీవి, హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కతోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మెగా157(Mega157) అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ చిత్రం గురించి ఏదోక అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇలా ప్రకటన ఇచ్చాడో లేదో ఈ సినిమాకు సంబంధించిన వర్క్ చకచక జరుపుకుంటుంది. పూజ కార్యక్రమం తర్వాత ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా రెండో షెడ్యూల్‌ని జరుపుకుంటుంది. ముస్సోరిలోని సుందరమైన ప్రదేశాలలో ఈ షెడ్యూల్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్‌లో నయనతార అడుగుపెట్టింది. కాగా ఈ చిత్రంలో నయన తార హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ షెడ్యూల్ నయన్, చిరుకు సంబంధించిన కీలక సన్నివేశాలకు సంబంధించిన చిత్రీకరణ జరుపుతున్నాడు అనిల్ రావిపూడి.
అంతేకాదు ఓ సాంగ్ షూటింగ్‌ని కూడా ప్లాన్ చేశాడట. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం కూడా పాల్గొంటోందని టాక్. కాగా ఈ చిత్రంలో చిరు డ్యూయోల్ రోల్ పోషిస్తున్నారట. ఇందులో ఓ పాత్ర వింటెజ్ చిరుని గుర్తు చేసేలా ఉంటుంది. ఈ సినిమా చిరు చంటబ్బాయి తరహాలో ఉంటుందని ముందే అనిల్ రావిపూడి హింట్ ఇచ్చేశాడు. ఇందులో చిరు పాత్రను ఆయన అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్‌ని వెల్లడించాడు. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఆ దిశ షూటింగ్‌ని కూడా శరవేగంగా ముందుకు తీసుకువెళుతున్నాడు.
మరోవైపు చిరు విశ్వంభర మూవీ సినిమా షూటింగ్‌తోను బిజీగా ఉన్నాడు. ఎప్పుడో సెట్‌పైకి వచ్చిన ఈ సినిమా స్లో స్లోగా షూటింగ్‌ని జరుపుకుంటుంది. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా రూపొందింది. ఈ చిత్రం నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఫ్యాన్స్ కాస్తా నిరాశ పరిచాయి. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌పై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. ఇందులో వాడిన వీఎఫ్‌ఎక్స్ చాలా పూర్‌గా ఉందని, కార్లూన్ ఫిలిం చూస్తున్నట్టు ఉందంటూ ట్రోల్ చేశారు. దీంతో ఈ సినిమా క్వాలిటీ విషయంలో మూవీ మళ్లీ రీవర్క్ చేస్తోందని టాక్. ఆ విషయంలోనే మూవీ ఆలస్యం అవుతుందనే సమాచారం.
ఇవి కూడా చదవండి:
- Rajinikanth Watched Kannappa: ‘కన్నప్ప’ చూసిన తర్వాత రజనీకాంత్ రియాక్షన్ ఇదే.. మంచు విష్ణు ఎమోషనల్!