Samantha Clarifies on YMC Promotions: ‘ఏమాయ చేసావె’ రీ రిలీజ్, నాగచైతన్యతో కలిసి ప్రమోషన్స్.. సమంత ఏమన్నందంటే?

Samantha Clarifies on Ye Maaya Chesave Re release Promotions with Naga Chaithanya: సమంత, నాగచైతన్యలు కలిసి నటించిన తొలి చిత్రం ‘ఏమాయ చేసావే’. ఈ చిత్రం విడుదలై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూవీ రీ రిలీజ్ కాబోతోంది. జూలై 18న ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో చై-సామ్ పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో దీనిపై ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా దీనిపై సమంత స్పందించింది.
తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె దీనిపై ప్రశ్న ఎదురైంది. ఈ వార్తలు నిజం లేదని, తాను ఎలాంటి ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావడం లేదంటూ అసహనం చూపించింది. “మూవీ టీంతో కలిసి నేను ఎలాంటి ప్రమోషన్స్ చేయడం లేదు. నిజానికి నేను సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నా. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి వార్తలు ఎవరు కల్పిస్తున్నారో నాకు తెలియడం లేదు. ఈ సినిమాకు ఉన్న అభిమానులకు నటీనటులు కలిసి ప్రమోట్ చేస్తే చూడాలనుకుని ఉండొచ్చు. అందుకే ఇలాంటి వార్తలు వచ్చుండోచ్చు.
అయినా ప్రేక్షకుల ద్రష్టి కోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదు” అని చెప్పుకొచ్చింది. అయితే ఏమాయ చేసావే తన మొదటి చిత్రం కాదని సమంత స్పష్టం చేసింది. తాను మొదట ‘మాస్కోవెన్ కావేరి’ సినిమా చేశాను. అందులో నా స్నేహితుడు రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించాడు. ఆ సినిమాకు షూటింగ్‌కి చాలా టైం తీసుకుంది. కొన్ని రోజుల షూటింగ్ అనంతరం లాంగ్ గ్యాప్ ఇచ్చారు. అదే టైంలో నేను ఏమాయ చేసావె సినిమా షూటింగ్‌లో పాల్గొన్న. కెరీర్ ప్రారంభంలో గౌతమ్ మీనన్ వంటి స్టార్ డైరెక్టర్స్ వర్క్ చేయడం ఎంతో సంతోషంగా అనిపించింది” అని చెప్పుకొచ్చింది.