Published On:

Vijay – Rashmika in Single Car: ఒకే కారులో జంటగా విజయ్‌ – రష్మిక.. రిలేషన్‌ని కన్ఫార్మ్‌ చేసేశారా..?

Vijay – Rashmika in Single Car: ఒకే కారులో జంటగా విజయ్‌ – రష్మిక.. రిలేషన్‌ని  కన్ఫార్మ్‌ చేసేశారా..?

Vijay Deverakonda and Rashmika Mandanna Spotted in Same Car: విజయ్‌ దేవరకొండ, రష్మిక మందననాలు రిలేషన్‌లో ఉన్నారంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్‌పై వీరు ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ, వారి డేటింగ్‌ రూమర్స్‌ వైరల్‌ అవుతుంటే.. మరోవైపు ఈ జంట లంచ్, డిన్నర్‌ డేట్స్‌కి వెళ్లి కెమెరాలకు చిక్కుతుంటారు. అంతేకాదు సీక్రెట్‌గా వెకేషన్‌కి వెళ్లి.. వేరు వేరుగా అక్కడి ఫోటోలు షేర్‌ చేస్తుంటారు.

 

దీంతో వీరిద్దరు కలిసే వెకేషన్‌కి వెళ్లారంటూ మీడియాలో వార్తలు గుప్పమంటాయి. కానీ, ఈ ఇద్దరు దీనిపై పెదవి విప్పడం లేదు. ముఖ్యంగా విజయ్‌.. అసలు ఈ రూమర్స్‌కి తనకి సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. కానీ, రష్మిక మాత్రం కొంచం కొంచంగా ఒపెన్‌ అవుతుంది. తన ప్రేమపై ప్రశ్నలు ఎదురైనప్పుడల్లా.. సైలెంట్‌గా హింట్‌ ఇస్తోంది. విజయ్‌, రష్మికలు పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

 

ఒకే కారులో జంటగా..

ఈ మధ్య వీరిద్దరు వారి వారి ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నా వీరద్దరు చాలా రోజుల తర్వాత జంటగా కనిపించాడు. ముంబై ఎయిర్‌పోర్టులో ఎయిర్‌పోర్టు నుంచి ఒకే కారులో వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకాలంగా సీక్రెట్‌గా, సైలెంట్ నడిపిన వీరి ప్రేమ వ్యవహరాన్ని మెల్లి మెల్లిగా బహిర్గతం చేస్తున్నారు. ఇప్పుడ ఏకంగా వీరిద్దరు ఒకే కారులో వెళుతూ కనిపించారు. నిజానికి ఎప్పుడు మీడియా కంట పడకుండ దోబూచూలాడే ఈ వీరు.. ఇప్పుడు మీడియా ముందే చకచక నడుచుకుంటూ వెళ్లి ఒకే కారు ఎక్కారు. ఇది ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్‌ చేస్తోంది.

 

రిలేషన్ కన్ఫార్మ్‌ చేశారా..?

ఇదేంటి.. ఇక వీరి రిలేషన్ ని కన్ఫార్మ్‌ చేసేశారా! అని నెటిజన్స్, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ సినిమాల  విషయానికోస్తే.. ప్రస్తుతం విజయ్‌ కింగ్‌ డమ్‌ చిత్రంతో బిజీగా ఉన్నాడు. షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమౌతోంది. మరోవైపు రష్మిక పాన్‌ ఇండియా స్థాయిలో దూసుకుపోతుంది. యానిమల్‌, పుష్ప 2, ఛావా చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకుంది. ప్రస్తుతం ఆమె కుబేర సినిమాతో బిజీగా ఉంది. జూన్‌ 20న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది.