Published On:

Donald Trump: పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్‌ కామెంట్స్‌

Donald Trump: పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్‌ కామెంట్స్‌

Donald Trump shocking Comments on Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ మనుషులను చంపుతూనే ఉంటారంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. యుద్ధం ఏమాత్రం మంచిది కాదంటూ ట్రంప్‌ హితవు పలికారు. మరోవైపు రష్యాపై మరిన్ని ఆంక్షలు ఉండొచ్చంటూ ట్రంప్‌ బెదిరింపులకు దిగారు. ఇటీవల ట్రంప్-పుతిన్‌ ఫోన్‌ కాల్‌లో మాట్లాడుకున్న విషయం తెలిసిందే.

 

ఉక్రెయిన్‌తో యుద్ధ విరమణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో డొనాల్డ్ ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. యుద్ధం ఆపుతాడని అనుకోవడం లేదంటూ పుతిన్‌తో ఫోన్‌ సంభాషణ అనంతరం వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌పై రష్యాతో యుద్ధ విరమణ చేయించడానికి ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ లక్ష్యంగా రష్యా మరోసారి భీకర దాడులకు తెరతీసిన విషయం తెలిసిందే.

 

గురువారం రాత్రి 7 గంటల వ్యవధిలో 550 వరకు డ్రోన్లు, 11 క్షిపణులను ప్రయోగించింది. రష్యా మూడేండ్ల కింద ఉక్రెయిన్‌పై దురాక్రమణ ప్రారంభించిన తర్వాత చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. షహీద్‌ డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణుల పేలుళ్ల మోతలతో కీవ్‌ దద్దరిల్లింది. సైరన్లు రాత్రంగా మోగుతూనే ఉన్నాయి. తమ ప్రజలు కఠినమైన, నిద్ర లేని రాత్రి గడిపారని అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

 

ప్రజలు మెట్రో స్టేషన్లు, బేస్‌మెంట్లు, భూగర్భ పార్కింగ్‌ గ్యారేజీల్లోకి పరుగులు తీశారని ఉక్రెయిన్‌ మంత్రి యూలియా తెలిపారు. కీవ్‌తోపాటు మరో ఐదు ప్రాంతాలపైకి రష్యా దాడులు చేసిందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. తాము 270 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో సంభాషణ జరిపిన రోజే దాడి జరగడం గమనార్హం.

ఇవి కూడా చదవండి: