Published On:

Ajith: ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ తరహా చిత్రాల్లో నటించాలని ఉంది: అజిత్

Ajith: ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ తరహా చిత్రాల్లో నటించాలని ఉంది: అజిత్

Ajith: కథానాయకుడు అజిత్‌ నటుడిగానే కాకుండా రేసర్‌, షూటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో అజిత్ నటించిన ప్రతి మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంది. తాజాగా తన రేసింగ్‌ టీమ్‌తో కలిసి సాహసాలు చేస్తున్న అజిత్‌ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. హాలీవుడ్‌ రేసింగ్‌ యాక్షన్‌ చిత్రాల్లో ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ తరహా మూవీలో నటించాలని ఉందని తన కోరికను బయటపెట్టారు.

 

‘బ్రాడ్‌ పిట్‌ ‘ఎఫ్‌1: ది చిత్రం’ నటించారు. అజిత్‌ను ‘24H సిరీస్‌’ తరహా చిత్రంలో చూడొచ్చా? అని యాంకర్‌ అడగ్గా, ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌, ఎఫ్‌1 స్వీకెల్‌ మూవీల్లో నటించాలని తనకు ఉందని చెప్పుకొచ్చారు. సాధారణంగా తన మూవీల్లో తానే స్వయంగా స్టంట్స్‌, రేసింగ్‌ సీక్వెన్స్‌ చేస్తానని చెప్పారు. అవకాశం ఉంటే కచ్చితంగా అలాంటి చిత్రం చేస్తానని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతోంది.

 

రేసింగ్‌ నేపథ్యంలో సాగే కథలు హాలీవుడ్‌లో చాలా వస్తుంటాయి. భారత్‌లో ఈ తరహా చిత్రాలను ప్రయత్నించినా అంత పెద్దగా వర్కవుట్‌ కాలేదు. ఇప్పుడు అజిత్ కోరిక ఎవరైనా దర్శకుడు స్క్రిప్ట్‌తో వస్తారేమో చూడాలి. స్వతహాగా అజిత్‌ రేసర్‌ కావడం, బైక్‌ స్టంట్స్‌ డూప్‌ లేకుండా చేయడం వంటివి కలిసి వచ్చే అంశాలు.

ఇవి కూడా చదవండి: