Ileana Second Child Birth: రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా.. సోషల్ మీడియాలో పోస్ట్!
Ileana Welcome Second Child, Father’s Day Post Goes Viral: హీరోయిన్ ఇలియానా మరోసారి తల్లయ్యిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన సెకండ్ ప్రెగ్నెన్సీని ప్రకటించింది. ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా తన కుమారుడు, భర్త ఫోటో షేర్ చేసింది. మంత్స్ బేబీతో తన భర్త మైఖేల్ డోలన్ దిగిన ఫోటోని షేర్ చేస్తూ బెస్ట్ డాడి అని చెప్పుకొచ్చింది.
దీంతో ఆ ఫోటో వైరల్‌గా మారింది. దీంతో ఇలియాన రెండోసారి తల్లయ్యిందా! అని అంత సర్‌ప్రైజ్ అవుతున్నారు. అయితే దీనిపై ఇలియాన నుంచి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. దీంతో ఈ విషయంలో ఆమె ఫ్యాన్స్ డైలామాలో ఉన్నారు. ఇది రెండో బిడ్డా, మొదటి బిడ్డా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇలియానా గత 2023లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టినట్టు ప్రకటిస్తూ.. బాబుకి కోవా ఫోనిక్స్ డోలన్ అని పేరు పెట్టినట్టు ప్రకటించింది.
అయితే అప్పటికీ తన భర్త పేరు కానీ, భర్తను కానీ పరిచయం చేయకపోవడంతో ట్రోల్స్ ఎదుర్కొంది. ఆ తర్వాత భర్తను కూడా పరిచయం చేసింది. ఇటీవల ప్రెగ్నెన్సీని ప్రకటించిన ఇలియాన బిడ్డ పుట్టినట్టు మాత్రం చెప్పలేదు. మరి ఈ విషయాన్ని ఆమె ఎప్పుడు రివీల్ చేసేవరకు వేయిట్ చేయాల్సిందే. గోవాలో పుట్టి పెరిగిన ఇలియానా దేవదాసు చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పోకిరి, జల్సా,మున్నా,కిక్, శక్తి, జులాయి, దేవుడు చేసిన మనుసులు వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.
ఆ తర్వాత హిందీలోనూ ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. తమిళ్‌లోనూ పలు సినిమాలు చేసిన ఇలియానా ఆ తర్వాత సడెన్‌గా వెండితెరకు దూరమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత అమర్, అక్భర్, ఆంటోనీ మరోసారి టాలీవుడ్ రీఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు కరువయ్యాయి. హిందీ ఆడపదడపా చిత్రాలు చేస్తున్న ప్రస్తుతం పూర్తి నటనను పక్కన పెట్టి తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటుంది.