Published On:

Sandeep Kishan Grandmother: హీరో సందీప్‌ కిషన్‌ ఇంట విషాదం.. నానమ్మ కన్నుమూత!

Sandeep Kishan Grandmother: హీరో సందీప్‌ కిషన్‌ ఇంట విషాదం.. నానమ్మ కన్నుమూత!

Sandeep Kishan Grandmother Died: టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన నానమ్మ ఆగ్నేసమ్మ(88) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సందీప్‌ కిషన్‌ తన సోషల్‌ మీడియా వేదికగా పంచుకుని ఎమోషనల్‌ అయ్యాడు. జ్ఞానాపురం సిరిల్‌ వీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయినిగా శ్రీపాదం ఆగ్నేసమ్మ పనిచేస్తున్నారు. విశాఖలోనే పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయినిగా పని చేసిన ఆమె ఎంతోమంది పేద పిల్లలను చదివించి వారి అవసరాలు తీర్చి అండగా నిలిచారు.

 

ఆమె పెద్ద కుమారుడు రవి తనయుడే హీరో సందీప్‌ కిషన్‌. నానమ్మ అతడికి మంచి అనుబంధం ఉందట. మద్రాస్‌లో స్థిరపడినప్పటికి తన తాత-నానమ్మల కోసం తరచూ జ్ఞానాపురంలో వెళ్లేవాడు. ఈ సందర్భంగా ఆమె మరణవార్తను షేర్ చేస్తూ తనకు ఎంతో ఇష్టమైన నానమ్మ ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేపోతున్నానన్నాడు. తన మేనమామ, ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కె నాయుడు కుటుంబ సభ్యులు కలిసి ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం విశాఖలో ఆగ్నేసమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొని ఆమెకు నివాళులు అర్పించారు.