Published On:

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ‘మురుగన్’ బుక్.. త్రివిక్రమ్ కోసమేనా?

Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ‘మురుగన్’ బుక్.. త్రివిక్రమ్ కోసమేనా?

Jr NTR Reading Lord Muruga book at airport next movie with at Trivikram: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త మూవీ కన్ఫార్మ్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ త్రివిక్రమ్ ఓ మైథలాజికల్ స్టోరీని రెడీ చేసిన సంగతి తెలిసిందే. శివుడిని వివిధ పేర్లతో అనగా స్కంధుడు, కుమార స్వామి, కార్తికేయ స్వామి, మురుగన్.. అంటూ పిలుస్తారు. ఇక్కడి నుంచే త్రివిక్రమ్.. మురుగన్ గాడ్ ఆప్ వార్ అనే టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉందని, ఇందులో ఎన్టీఆర్ కుమారస్వామి పాత్రలో కనిపించనున్నారని ఫ్యాన్స్ అంటున్నారు.

 

కాగా, ఇటీవల ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో కనిపించాడు. ‘వార్ 2’కు సినిమా ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ ముంబయి చేరుకోగా… ఆయనను ఫొటోగ్రాఫర్లు తీసిన ఫోటోలో చేతిలోని ‘మురుగ: ది లార్డ్ ఆఫ్ వార్, ది గాడ్ ఆఫ్ విగ్డమ్’ పుస్తకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పుస్తకాన్ని రచయిత ఆనంద్ బాలసుబ్రమణియన్ రచించగా.. ఇందులో కార్తికేయుడి కథను చక్కగా వివరించారు. దీంతో దర్శకుడు త్రివిక్రమ్‌తో చేయనున్న ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ సన్నద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. అందుకే దీనిని చదువుతున్నారని పలువురు భావిస్తున్నారు.

 

ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల నిర్మాత నాగవంశీ సైతం ఆసక్తికర పోస్టులు చేయడంతో మరింత ఆతృతతో ఉన్నారు. కాగా, కార్తికేయుడి పద్యాన్ని ఆయన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. మరోవైపు, ఎన్టీఆర్ ఫ్యాన్ష్ ఎక్స్ వేదికగా.. లార్డ్ ఆఫ్ వార్, గాడ్ ఆఫ్ విస్ డమ్.. అంటూ ట్రెండ్ చేయగా.. మరికొంతమంది అన్న డెడికేషన్ వేరే లెవల్, కెరీర్ పర్ఫార్మెన్స్ లోడింగ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి: