Jani Master: న్యాయస్థానంపై నమ్మకం ఉంది – నిర్దోషిగా బయటకు వస్తాను: జానీ మాస్టర్
Jani Master Release Video: తనపై వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించాడు. తనకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటకు వస్తానని అన్నారు. ఈ మేరకు తన ట్విటర్‌లో వీడియో రిలీజ్ చేశాడు. మీడియాలో వస్తున్న వార్తలకు నా సమాధానం ఇదే. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది కాబట్టే నేను నలుగురితో కలిసి పని చేసుకోగలుగుతున్నా. నలుగురితో హ్యాపీగా ఉన్నా. అసలేం జరిగిందనేది నా మనసుకు తెలుసు. ఆ దేవుడుకు తెలుసు. ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుంది. నేను క్లీన్‌చిట్‌తో బయటకు వస్తాను. అప్పుడే నేను స్పష్టంగా మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. కేవలం నిందితుడిని మత్రమే” అని చెప్పుకొచ్చారు.
When we all see justice, then we'll all see peace!!
Let the Law decide the verdict. Till then please be patient and sensible 🙏🏻 pic.twitter.com/BNuThVAvDv
— Jani Master (@AlwaysJani) December 25, 2024
కాగా జానీ మాస్టర్‌పై ఆయన అసిస్టెంట్, మహిళ కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గత సెప్టెంబర్‌లో నార్సింగ్ పోలీసులు బాధిత యువతి జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేసింది. కొంతకాలంగా జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధిస్తున్నాడని, మత మార్పిడి కూడా చేసుకోవాలంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లాడు. కొన్ని రోజులు జైలులో శిక్ష అనుభవించిన ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్‌కు వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకున్నారు.