Last Updated:

Thandel Trailer: నాగ చైతన్య, సాయి పల్లవి ‘తండేల్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఎక్కడో తెలుసా?

Thandel Trailer: నాగ చైతన్య, సాయి పల్లవి ‘తండేల్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఎక్కడో తెలుసా?

Thandel Trailer Launch Event: అక్కినేని హీరో, యువసామ్రాట్‌ నాగ చైతన్య ఈ సారి తండేల్‌తో అభిమానులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినమా ఫిబ్రవరి 7, 2025న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌తో పాటు ప్రమోషనల్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది మూవీ టీం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ముఖ్యంగా బుజ్జితల్లి పాటకు విశేష స్పందన వచ్చింది. ఇక రీసెంట్‌గా విడుదలైన హైలెస్సో హైలెస్సా పాటు ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. వీరిద్దరు ఇద్దరూ గతంలో ‘లవ్‌స్టోరీ’ నటించి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఇందులో వారిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు తండేల్‌ కోసం మరోసారి జతకట్టిన చై, సాయి పల్లవి మరోసారి అదే మేజిక్‌ రిపీట్‌ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో మూవీపై మంచి హైప్‌ క్రియేట్‌ అయ్యింది. ఇదిలా ఉంటే తండేల్‌ మూవీ ట్రైలర్‌ని జనవరి 28న విడుదల చేస్తామని మూవీ టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రేపు విడుదల అయ్యే ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని మేకర్స్‌ భారీగా ప్లాన్‌ చేశారు.

అయితే హైదరాబాద్‌లో కాకుండ ఏపీలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్టు తాజాగా మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. జనవరి 28న సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నంలోని శ్రీరామ పిక్చర్స్‌ ప్లేస్‌లో ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమానికి నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేకమైన పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు. కాగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. దీనికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఫిబ్రవరి 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదల కానుంది.