Last Updated:

Lava Yuva Smart: రూ.6వేలకే కొత్త స్మార్ట్‌ఫోన్.. లావా అదరగొట్టింది.. ఫీచర్లు ఏంట్రా బాబు ఇలా ఉన్నాయ్..!

Lava Yuva Smart: రూ.6వేలకే కొత్త స్మార్ట్‌ఫోన్.. లావా అదరగొట్టింది.. ఫీచర్లు ఏంట్రా బాబు ఇలా ఉన్నాయ్..!

Lava Yuva Smart: భారతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా నిశ్శబ్దంగా కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ఇది లావా ‘యువ’ సిరిలో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్లను అందిస్తుంది. ముఖ్యంగా ఇటీవల ప్రారంభించిన యువ 2 5జీ సక్సెస్ తర్వాత యువ స్మార్ట్‌ ఫోన్ విడుదల చేశారు. ఈ కొత్త మొబైల్ పెద్ద బ్యాటరీ, డ్యూయల్ కెమెరా , స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది. లావా యువ స్మార్ట్ మొబైల్ అత్యంత చౌక ధరలో విడుదలైంది.

ఈ ఫోన్‌లో డ్యూయల్ AI కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఇది Unisoc 9863A ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్ 6.75 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3GB RAM, 64GB నిల్వ, 5000mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడా వస్తుంది. ఈ కొత్త ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

Lava Yuva Smart Price
లావా యువ స్మార్ట్‌ ఫోన్ కేవలం రూ.6,000 ప్రారంభ ధరకే విడుదలైంది. తక్కువ ధరలో కొత్త మొబైల్ కొనుగోలు చేసే వారికి ఇది మంచి ఎంపిక. ఈ ఫోన్ మూడు కలర్స్‌లో వస్తుంది. ఇందులో బ్లూ, వైట్, లావెండర్ ఉన్నాయి. 1-సంవత్సరం వారంటీని అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

Lava Yuva Smart Features
లావా యువ స్మార్ట్‌ ఫోన్‌లో 6.75-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇది 720 x 1600 పిక్సెల్‌ల రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ డిస్ప్లే వీడియో, వెబ్ బ్రౌజింగ్ కోసం ఖచ్చితంగా సరిపోతుంది. ఈ ఫోన్ డిజైన్ ఆకర్షణీయమైన, ప్రీమియం లుక్‌ని కలిగి ఉంది. మొబైల్‌లో Unisoc 9863A ఆక్టాకోర్ ప్రాసెసర్‌ ఉంటుంది. ఈ లావా యువ స్మార్ట్‌ ఫోన్ ఆండ్రాయిడ్ 14 గో వెర్షన్‌లో రన్ అవుతుంది. లావా యువ స్మార్ట్‌ ఫోన్‌లో 3GB,  3GB వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. అదనంగా ఈ ఫోన్ 64GB స్టోరేజ్ ఎంపికను కలిగి ఉంది. మీరు మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 512GB వరకు పెంచుకోవచ్చు.

కొత్త లావా యువ స్మార్ట్‌ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 13-మెగాపిక్సెల్ AI ప్రైమరీ కెమెరా ఉంది. ఇందులో AI ఫీచర్లతో కూడిన సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఇందులోని స్క్రీన్ ఫ్లాష్‌‌తో తక్కువ కాంతిలో కూడా మంచి సెల్ఫీలను క్లిక్ చేయచ్చు.

లావా యువ స్మార్ట్‌ ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఇది రోజంతా బ్యాకప్ అందిస్తుంది. ఈ ఫోన్‌లో 10W టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. స్మార్ట్‌ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్‌లో మోనో స్పీకర్ కూడా ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్, Wi-Fi మొదలైనవి ఉన్నాయి.