Last Updated:

Budget 2025 income tax: మిడిల్ క్లాస్‌కు గుడ్ న్యూస్.. నెలకు లక్ష జీతం ఉన్నా నో ట్యాక్స్

Budget 2025 income tax: మిడిల్ క్లాస్‌కు గుడ్ న్యూస్.. నెలకు లక్ష జీతం ఉన్నా నో ట్యాక్స్

Propose to introduce new Income Tax Slabsin Budget 2025: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మిడిల్ క్లాస్, మీడియం రేంజ్ ఎంప్లాయిస్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఇక ఇన్‌కమ్ ట్యాక్స్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రకటించారు. ఈ మేరకు కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్‌ విధానంలో శ్లాబ్‌లను మార్చారు. అయితే దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే ఈ మొత్తం రూ.12,75,000 వరకు పెరుగుతుంది. వీరంతా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే సగటున ప్రతి నెలా జీతం రూ.లక్ష ఉన్నా.. ఇంకా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.

న్యూ ట్యాక్స్‌లో శ్లాబ్‌లు
రూ.0 నుంచి 4 లక్షలు – నిల్
రూ.4 నుంచి 8 లక్షలు – 5%
రూ.8 నుంచి 12 లక్షలు – 10%
రూ.12 నుంచి16 లక్షలు – 15%
రూ.16 నుంచి 20 లక్షలు – 20%
రూ.20 నుంచి 24 లక్షలు – 25%
రూ.24 లక్షల పైన 30 శాతం వరకు ట్యాక్స్ ఉండనుంది.