Flipkart Amazing Offers: అమేజింగ్ ఆఫర్స్.. ఈ మూడు ఫోన్లపై వేలల్లో డిస్కౌంట్లు.. మిస్ అయితే కష్టమే..!
Flipkart Amazing Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే బొనాంజా సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో మూడు అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌లో భాగంగా మీరు రియల్‌మి, మోటరోలా, ఒప్పో, స్మార్ట్‌ఫోన్లను రూ.5,500 వరకు డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్లపై క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు కూడా ఉన్నాయి. అయితే ఎక్స్‌ఛేంజ్‌లో లభించే డిస్కౌంట్ మీ ఫోన్, దాని బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఈ ఫోన్‌లలో 50 మెగాపిక్సెల్ వరకు కెమెరా, 125 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంటాయి.
Motorola Edge 50 Ultra
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోటరోలా 12జీబీ ర్యామ్+512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేేరియంట్ ధర రూ.49,999. బ్యాంక్ ఆఫర్‌లో రూ. 5,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో చెల్లించే వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ.48,200 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్, 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చూస్తారు. ప్రాసెసర్‌గా కంపెనీ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3ని అందిస్తోంది. ఫోన్ బ్యాటరీ 4500mAh, రెండు 125 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Realme GT 6
16జీబీ ర్యామ్+ 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.39,999. ఇది సేల్‌లో రూ. 2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.39,200 వరకు చౌకగా మారుతుంది. ఈ రియల్‌మి ఫోన్ డిస్‌ప్లే 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. సెల్ఫీ కోసం మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. ఫోన్‌లో 120W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీ ఉంది.
OPPO F27 5G
8జీబీ ర్యామ్+128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లోరూ.20,999కి లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో రూ.2,000 తగ్గింపుతో మీరు ఈ ఫోన్‌ను దక్కించుకోవచ్చు. 5శాతం క్యాష్‌బ్యాక్ పొందడానికి మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేయాలి. మీకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 20,300 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఒప్పో ఫోన్ 50-మెగాపిక్సెల్ మెయిన్ , 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. దీని ఫుల్ HD+ డిస్‌ప్లే 6.67 అంగుళాలు. ఫోన్ బ్యాటరీ 5000mAh, ఇది 45W సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.