Vivo T3 Lite 5G: ఇచ్చిపడేశాడు బ్రో.. రూ.9,499కే వివో 5జీ ఫోన్.. ఆఫర్లంటే ఇలా ఉండాలి..!
Vivo T3 Lite 5G: వివో కంపెనీ తాజాగా తన ‘T’ సిరీస్ వివో T3 ప్రో, T3 అల్ట్రా ఫోన్‌ల ధరలను తగ్గించింది. ఇప్పుడు Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్‌లపై కూడా భారీ ఆఫర్ ప్రకటించింది. మీరు ఈ ఫోన్6GB RAM వేరియంట్‌ను రూ. 11,000 కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 6.56 అంగుళాల డిస్‌ప్లే ఉంది. రండి, ఈ ఫోన్ కొత్త ధర, ఆఫర్, ఫీచర్లను తెలుసుకుందాం.
Vivo T3 Lite 5G మొబైల్ గతేడాది జూన్‌లో విడుదలైంది. ఈ ఫోన్‌ను రెండు స్టోరేజ్ ఆప్షన్లలో విక్రయించారు. మీరు వైబ్రంట్ గ్రీన్, మెజెస్టిక్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలు చేయచ్చు. ఇది మెడిటెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అలానే 6.56 అంగుళాల డిస్‌ప్లే ఉంది. 5,000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ లాంచ్ ధర కంటే తక్కువకే అందుబాటులో ఉంది.
Vivo T3 Lite 5G Offers
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ని రూ.10,499కి విడుదల చేశారు. 6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 11,499గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,000 తగ్గింపుతో విక్రయిస్తున్నారు. ఈ ఆఫర్ Axis, SBI లేదా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఉంది. మీరు డిస్కౌంట్‌తో 4GB RAM వేరియంట్‌ను కేవలం రూ.9,499 వద్ద పొందచ్చు. 6GB RAM వేరియంట్‌ను రూ. 10,499కి కొనుగోలు చేయవచ్చు.
Vivo T3 Lite 5G Features
Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 1612 x 720 పిక్సెల్ రిజల్యూషన్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ Vivo మొబైల్‌లో MediaTek Dimension 6300 ప్రాసెసర్ ఉంది. గ్రాఫిక్స్ కోసం, ఇది ఆర్మ్ మాలి G57 MC2 GPUని కలిగి ఉంది. ఈ మొబైల్ Android 14 ఆధారంగా Funtouch OS 14తో పని చేస్తుంది.
Vivo T3 Lite 5G మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సోనీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అదనంగా ఈ మొబైల్‌లో 6GB RAM +128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
Vivo T3 Lite 5G ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 15W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఈ Vivo స్మార్ట్‌ఫోన్‌ని వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP64 రేటింగ్‌తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో డ్యూయల్ సిమ్ 5G, 4G, Wi-Fi, బ్లూటూత్, అనేక ఇతర ఫీచర్లు ఉన్నాయి.