Last Updated:

Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కుప్పలు కుప్పలుగా ఆఫర్లు.. 31 వరకే ఛాన్స్..!

Flipkart Mobile Offers: ఫ్లిప్‌కార్ట్ కొత్త సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై కుప్పలు కుప్పలుగా ఆఫర్లు.. 31 వరకే ఛాన్స్..!

Flipkart Mobile Offers: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ ఫెస్టివల్ సేల్ ప్రకటించింది. జనవరి 31 వరకు జరుగుతున్న ఈ సేల్‌లో  మోటరోలా స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డీల్స్, డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్‌లో రూ.5,500 వరకు తగ్గింపుతో 50 మెగాపిక్సెల్‌ల సెల్ఫీ కెమెరాలతో కూడిన మోటరోలా ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. విశేషమేమిటంటే ఈ సేల్‌లో కేవలం రూ.6999కే 50 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో కూడిన జీ సిరీస్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. సేల్‌లో మోటరోలా ఫోన్లపై క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తున్నారు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్సె‌ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.

1. Motorola Edge 50 Ultra 5G
12 GB RAM+512 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఫోన్ వేరియంట్ రూ. 49,999 సేల్‌లో అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లలో రూ.5500 వరకు తగ్గింపుతో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే మీకు 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 48,200 వరకు చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో మీరు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను చూస్తారు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8sజెన్ 3లో పని చేస్తుంది.

2. Motorola Edge 50 Fusion
8 GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర 21,999 రూపాయలతో ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. బ్యాంక్ ఆఫర్లలో రూ. 2500 వరకు తగ్గింపుతో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. 5శాతం క్యాష్‌బ్యాక్ కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించాలి. ఫోన్‌పై రూ.20,600 వరకు క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లో మీకు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా లభిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2లో పని చేస్తుంది. ఫోన్‌లో ఇచ్చిన pOLED కర్వ్డ్ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.

3. Motorola G05
4 GB RAM+64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ రూ.6999కి అందుబాటులో ఉంది. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీకు 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ.6,450 లాభం పొందవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే మీరు ఫోన్‌లో 6.67 అంగుళాల HD + డిస్‌ప్లే పొందుతారు. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్, సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్స్. మీరు ఈ ఫోన్‌లో 5200mAh బ్యాటరీని పొందుతారు.