Last Updated:

Ram Gopal Varma: రామ్ గోపాల్‌ వర్మకు మరోసారి నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు

Ram Gopal Varma: రామ్ గోపాల్‌ వర్మకు మరోసారి నోటీసులు ఇచ్చిన ఏపీ పోలీసులు

Again Police notice to Ram Gopal Varma: టాలీవుడ్‌ సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు తాజాగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 4న విచారణకు రావాలని ఆదేశిస్తూ వాట్సప్ ద్వారా ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తాను ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నానని, ఫిబ్రవరి 4న విచారణకు రాలేనని పోలీసులు పోలీసులకు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న విచారణకు వస్తానని ఆయన పోలీసులకు తెలిపారు.

అయితే పోలీసులు మాత్రం ఫిబ్రవరి 4న తప్పకుండ విచారణకు హాజరుకావాల్సిందే అని నోటీసులు పేర్కొన్నారు. కాగా గత కొద్ది రోజులుగా రామ్‌ గోపాల్‌ వర్మను కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌లను విమర్శిస్తూ అభ్యంతర పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఆయనపై ఏపీలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆయన ఏపీ హైకోర్టు ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం ఆయన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

దర్యాప్తుకు సహాకరించాలని, వారు కోరినప్పుడు విచారణకు అందుబాటులో ఉండాలని ఆర్జీవీ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఏపీ ఎన్నికల సమయంలో తన చిత్రం వ్యూహం మూవీ ప్రమోషన్స్‌ భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌లపై వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా రామ్‌ గోపాల్‌ వర్మ పోస్ట్స్‌ పెట్టారని ఆరోపిస్తూ ఒంగోలు మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారం ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు.