Last Updated:

Thandel Trailer: నాగ చైతన్య ‘తండేల్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది – ఎప్పుడంటే!

Thandel Trailer: నాగ చైతన్య ‘తండేల్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది – ఎప్పుడంటే!

Naga Chaitanya Thandel Trailer Release Date: అక్కినేని హీరో నాగచైతన్య కొంతకాలంగా వరుస ప్లాప్స్‌ చూస్తున్నాడు. బంగర్రాజు సినిమా తర్వాత అతడు నటించిన థ్యాంక్యూ, కస్టడీ, లాల్‌సింగ్‌ చద్ధా సినిమాలు చేశాడు. ఇవన్ని కూడా బాక్సాఫీసు వద్ద పరాజయం చెందాయి. దీంతో ఈసారి ఎలాగైన భారీ హిట్‌ కొట్టాలని ‘తండేల్‌’తో వస్తున్నాడు. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత మరోసారి ఈ సినిమాలో సాయి పల్లవితో జతకట్టాడు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్‌ కాబోతోంది.

ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌ స్టార్ట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌, పాటలతో మూవీ మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఈ క్రమంలో మూవీ ట్రైలర్‌ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా తండేల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించింది మూవీ టీం. జనవరి 28న ట్రైలర్‌ని రిలీజ్‌ చేస్తున్నట్టు తాజాగా మూవీ టీం ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో ట్రైలర్ విడుదల కానుందని సమాచారం. దీంతో అక్కినేని అభిమానులంతా ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు.

కాగా అగ్ర నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో సమర్పణలో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా దేశభక్తి నేపథ్యంలో ఈ సినిమాగా రూపొందుతుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. ఫిబ్రవరి 27న ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది.