Last Updated:

2023 Movies : ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు ఇవే ..

2023 Movies : 2023 సంవత్సరం భారతీయ సినిమాకు బూస్టర్‌గా పనిచేసింది. ముఖ్యంగా చాలా కాలం నుంచి సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న అగ్రహీరోలకు ఈ ఏడాది కలిసొచ్చింది. ఈ సంవత్సరం బాక్సాఫీస్‌పై పలు చిత్రాలు రికార్డులు సృష్టించాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప , కేజీఎఫ్ 2, కాంతార చిత్రాల తర్వాత బాక్సాఫాస

2023 Movies : ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలు ఇవే ..

2023 Movies : 2023 సంవత్సరం భారతీయ సినిమాకు బూస్టర్‌గా పనిచేసింది. ముఖ్యంగా చాలా కాలం నుంచి సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న అగ్రహీరోలకు ఈ ఏడాది కలిసొచ్చింది. ఈ సంవత్సరం బాక్సాఫీస్‌పై పలు చిత్రాలు రికార్డులు సృష్టించాయి. ఆర్ఆర్ఆర్, పుష్ప , కేజీఎఫ్ 2, కాంతార చిత్రాల తర్వాత బాక్సాఫాసీ వద్ద భారీ బడ్జెట్ చిత్రాలు అంతగా సందడి చేయలేకపోయాయి. ఈ ఏడాది సౌత్ నుండి బాలీవుడ్ వరకు స్టార్ హీరోస్ మూవీస్ మంచి విజయాన్ని అందుకున్నాయి.2023 లో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ చిత్రాలు భారీగా వసూళ్లు రాబట్టాయి.

2023లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు..

1. జవాన్ : బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరం పఠాన్ సినిమాతో వచ్చాడు . ఆ తర్వాత జవాన్ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఈ సంవత్సరం బాద్ షాకు కలిసోచ్చిందనే చెప్పాలి. ఇక ఇప్పటికే రెండు భారీ బడ్జెట్ చిత్రాలతో అలరించిన షారుఖ్.. ఇప్పుడు మూడో సినిమాతో మరోసారి రికార్డ్ బ్రేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సంవత్సరం కింగ్ ఖాన్ రెండవ చిత్రం జవాన్ 2023లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది . ప్రపంచవ్యాప్తంగా రూ.1,144 కోట్లు సంపాదించింది.

2. పఠాన్ : జవాన్ కంటే ముందు షారుఖ్ నటించిన పఠాన్ చిత్రం హిట్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఊహకు అందనిది.ఈ చిత్రం అనేక వివాదాలు ఎదురుకొని విడుదల అయ్యింది . అయినా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.1,000 కోట్ల మార్కును దాటిన మొదటి చిత్రంగా నిలిచింది. నివేదికల ప్రకారం ఈ చిత్రం దాదాపు 199 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది.

3. లియో : 2023 బ్లాక్ బస్టర్ లో లియో ఒకటి . తలపతి విజయ్ హీరో గా,లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 615 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమాలో సంజయ్ దత్, త్రిష, మన్సూర్ అలీ ఖాన్, జార్జ్ మరియన్ తదితరులు నటించారు.

4. గదర్ 2 : సన్నీ డియోల్, అమీషా పటేల్ కలిసి నటించిన గదర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. గదర్2 అనేది 2011లో హిట్ అయిన గదర్: ఏక్ ప్రేమ్ కథకు సీక్వెల్. ఇది ప్రపంచవ్యాప్తంగా $87 మిలియన్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ఉత్కర్ష్ శర్మ , సిమ్రత్ కౌర్ కూడా నటించారు. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 11న విడుదలైంది.

5. టైగర్ 3 : సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రన్ అవుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మార్క్‌ను దాటడానికి దగ్గరగా ఉంది. ఈ చిత్రం రికార్డ్స్ సృష్టిస్తోంది . అంతేకాకుండా సల్మాన్ ఖాన్ కెరీర్ లో అతిపెద్ద హిట్ చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రంలో భాయిజాన్‌తో పాటు కత్రినా కైఫ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలు పోషించారు.

ఇవే కాకుండా ఈ ఏడాది చివరలో యానిమల్, సలార్, డుంకీ అనే మూడు భారీ విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను కట్టిపడేయడమే కాకుండా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అంచనాలు వేస్తున్నారు .