Published On:

Anupriya Goenka: ముద్దు పెట్టుకుంటూ.. అక్కడ చెయ్యి వేశాడు

Anupriya Goenka: ముద్దు పెట్టుకుంటూ.. అక్కడ చెయ్యి వేశాడు

Anupriya Goenka:  ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించే రంగులు అందంగా ఉన్నా.. కనిపించని రంగులు చీకటి కోణాలను చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎక్కువ ఆలాంటి చీకటి కోణాలను చూసినవారే. అవకాశాల ఇస్తామని కొందరు .. డబ్బు ఎరచూపిమరికొందరు, స్టేటస్ ఉందని ఇంకొందరు.. హీరోయిన్స్ పై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.

 

అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సెట్ లో వేధించేవారు ఇంకొందరు. మొన్నటికి మొన్న అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే బట్టలు మార్చుకుంటున్న వ్యానిటీ వ్యాన్ లోకి డోర్ కొట్టి రాకుండా డైరెక్ట్ గా ఒక డైరెక్టర్ లోపలి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు మరో నటి.. ఇంటిమేటెడ్ సీన్స్ చేసేటప్పుడు ఒక నటుడు హద్దుమీరి  ప్రవర్తించాడని చెప్పుకురావడం సంచలనంగా మారింది.

 

బాలీవుడ్ నటి అనుప్రియా గోయెంకా గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. 2013 తెలుగు సినిమా పోటుగాడు సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టి 2014లో బాబీ జాసూస్‌ సినిమాతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. హిందీలో 3టైగర్ , పద్మావత్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అసుర్, ఆశ్రమ్ లాంటి వెబ్ సిరీస్ లలో కూడా కనిపించింది.

 

తాజాగా అనుప్రియ ఒక ఇంటర్వ్యూలో కెరీర్ మొదట్లో జరిగిన కొన్ని చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. ” నేను ఒక సినిమాలో ఇంటిమేటెడ్ సీన్స్ షూటింగ్ చేస్తున్నాను. నాతో పాటు ఉన్న నటుడు.. నన్ను నడుము మీద పట్టుకొని లిప్ కిస్ చేయాలి. అదే సీన్ పేపర్ లో రాసి ఉంది. కథకు తగ్గట్టే ఆ సీన్ ఉండడంతో చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పడంతో సీన్ షూట్ చేశాం.

 

అయితే ఆ నటుడు ముద్దు పెట్టుకుంటూ.. నన్ను తాకారని చోట తాకాడు. నాకు చాలా బాధ అనిపించింది. అతడికి చెప్తే కచ్చితంగా చూడలేదు.. అనుకోకుండా తగిలి ఉంటుందిఅనేవాడు . అందుకే నేనేమి మాట్లాడలేదు. ఆ సీన్ లో అతను ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నేను చాలా కంట్రోల్ లో ఉన్నాను. నాకు రెండు సార్లు ఇలా జరిగింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతమ ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇది ఏ సినిమా సమయంలో చెప్పకపోవడంతో ఆ నటుడు ఎవరు అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు.