Jacqueline Fernandez: ఇండస్ట్రీలో విషాదం.. స్టార్ హీరోయిన్ తల్లి కన్నుమూత

Jacqueline Fernandez: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ పెర్నాండజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కిమ్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు మార్చి 24 న ఆమెకు గుండెపోతూ రావడంతో ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆమె ఈ ఉదయం కన్నుమూసింది. దీంతో జాక్వెలిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జాక్వెలిన్ తల్లి మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
జాక్వెలిన్ పెర్నాండజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో వరసగా ఆమెకు గ్లామర్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి. ఆ తరువాత ఆమె నటించిన హౌస్ ఫుల్ 2(2012), రేస్ 2(2013) సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో సాహో సినిమాలో ఐటెంసాంగ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక దీని తరువాత విక్రాంత్ రోణ సినిమాలో కూడా ఒక మంచి సాంగ్ లో నటించి మెప్పించింది.
సినిమాలతో కన్నా వివాదాలతోనే జాక్వెలిన్ పెర్నాండజ్ గుర్తింపు తెచ్చుకుంది. మనీలాండరింగ్ కేసులో అమ్మడు ఆరోపణలను ఎదుర్కుంటుంటుంది. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న అతడు తీహార్ జైల్లో ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అతని నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ.7 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అధికారులు 2022 ఏప్రిల్ 30న అటాచ్ చేసారు. ఇప్పటికీ ఈ కేసు నడుస్తూనే ఉంది.