Last Updated:

CM Revanth Reddy: టాలీవుడ్‌తో భేటీ – బెనిఫిట్ షోలు, టికెట్‌ రేట్ల పెంపుపై సీఎం క్లారిటీ!

CM Revanth Reddy: టాలీవుడ్‌తో భేటీ – బెనిఫిట్ షోలు, టికెట్‌ రేట్ల పెంపుపై సీఎం క్లారిటీ!

CM About Benefit Show and Ticket Rates: సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సినీ పరిశ్రమకు పలు కీలక ప్రతిపాదనలు చేసింది. అలాగే సినీ ప్రముఖులు కూడా ఇండస్ట్రీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.

సినీ పరిశ్రమకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం టికెట్‌ రేట్ల పెంపు, బెనిఫిట్‌ షో విషయంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉంటామన్నారు. ఇకపై సినిమా రిలీజ్‌కు ముందు బెనిఫిట్‌ షోలు, టికెట్ల రేట్స్‌ పెంపు ఉండవని స్పష్టం చేశారు. అదే విధంగా సినిమా రిలీజ్‌ ముందు కానీ, విడుదల సమయంలో కానీ హీరోలు ర్యాలీలకు అనుమతి ఉండదన్నారు. అయితే తాను సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదనీ, ఉద్దేశపూర్వకంగా ఎవరిపై కేసుల పెట్టలేదని సంధ్య థియేటర్ ఘటనని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

అలాగే సినీ పరిశ్రమ ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దుతు ఇవ్వాలని, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సినిమా హీరోహీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో తప్పకుండ పాల్గొనాలని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహకాలను ప్రచారం చేయాలన్నారు. ప్రతి సినిమా ప్రదర్శనకు ముందు యాడ్‌ ప్లే చేయాలని, కులగణన సర్వే ప్రచార కార్యక్రమంలో నటీనటులు అందరూ సహకరించాలన్నారు. అనంతరం సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫూటేజ్‌ని పోలీసులు ఈ సమావేశంలో ప్లే చేసి చూపించారు.