Allu Arjun: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా
Allu Arjun Bail Petition Postponed: సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఇవాళ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అరెస్ట్ కాగా నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కూడా విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అయితే అదే ఆయన క్వాష్ పటిషన్‌ని విచారించిన హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో తాజాగా ఆయన రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ, బన్నీ పిటిషన్‌పై కౌంటర్ వేసేందుకు ప్రభుత్వం తరపున న్యాయవాదులు సమయం కోరారు. దీంతో బన్నీ బెయిల్ పిటిషన్ విచారణ నాంపల్లి కోర్టు డిసెంబర్ 30కి వాయిదా వేసింది.