Published On:

Ari Release Date: ఎట్టకేలకు విడుదలకు నోచుకున్న అనసూయ ‘అరి’ చిత్రం.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Ari Release Date: ఎట్టకేలకు విడుదలకు నోచుకున్న అనసూయ ‘అరి’ చిత్రం.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Anchor Anasuya Ari Movie Release Date Out: ఎట్టకేలకు యాంకర్‌ అనసూయ నటించిన చిత్రం విడుదలకు నోచుకుంది. ఎప్పుడో రెండేళ్ల క్రితమే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా విడుదల తేదీని ఫిక్స్‌ చేసుకుంది. యాంకర్‌ అనసూయ, సాయి కుమార్‌, శుభలేక సుధాకర్‌ వంటి ప్రముఖులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. పేపర్‌ బాయ్‌ ఫేం జయశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సింది. కానీ తరచూ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ వాయిదా పడుతూ వస్తోంది.

 

ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కి నోచుకుంది. ఈ మేరకు మూవీ విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్‌ ప్రకటన ఇచ్చారు. మే 30న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతోంది. వినోద్‌ వర్మ, సూర్య పురిమెట్ల, శ్రీకాంత్‌ అయ్యర్‌ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. అర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్‌ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డిలు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్‌ బాగా ఆకట్టుకున్నాయి.

 

 

అనసూయతో పాటు ఇతర నటీనటుల లుక్స్‌, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన థీమ్‌ సాంగ్‌ కూడా బాగా ఆకట్టుకుంటుంది. దీంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అరిషడ్వరగాల అనే కొత్త కన్సెప్ట్‌తో దర్శకుడు ఈ సినిమా రూపొందించారు. ఇదివరకు ఎవరూ టచ్‌ చేయని జానర్‌ అని చెప్పాలి. మైథలాజికల్‌ థ్రిల్లర్‌గా సరికొత్త కాన్పెస్ట్‌తో డైరెక్టర్‌ జయశంకర్‌ ఈ సినిమాను తెరకెక్కించారని, క్రష్ణ తత్వాన్ని కొత్తగా చూపించామని.. అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చుతుందనే నమ్మకం ఉందని మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటన సందర్భందా చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.