Last Updated:

Allu Arjun : కొత్త మూవీ అనౌన్స్ చేసిన అల్లు అర్జున్.. ఈసారి సందీప్ వంగా డైరెక్షన్ లో !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో, డాన్స్ లతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన అల్లు అర్జున్.. పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు మెగా ఫ్యామిలీ నుంచి.. ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా బన్నీకి అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

Allu Arjun : కొత్త మూవీ అనౌన్స్ చేసిన అల్లు అర్జున్.. ఈసారి సందీప్ వంగా డైరెక్షన్ లో !

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన నటనతో, డాన్స్ లతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిన అల్లు అర్జున్.. పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు మెగా ఫ్యామిలీ నుంచి.. ఇటు అల్లు ఫ్యామిలీ నుంచి కూడా బన్నీకి అభిమానులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఈ మూవీ తో సౌత్ తో పాటు ముఖ్యంగా నార్త్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఒక సినిమాని ప్రకటించాడు బన్నీ. కాగా ఈ తరుణంలోనే మరో మూవీని పట్టాలెక్కించేయడానికి రెడీ అయ్యాడు బన్నీ.

పాన్ ఇండియా టార్గెట్ గా సందీప్ – అల్లు అర్జున్ (Allu Arjun)..

తాజాగా అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వెల్లడించారు. టీ సిరీస్ ప్రొడక్షన్స్ మరియు భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ మరియు సందీప్ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కలిసి నిర్మించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమా ప్రకటించడంతో బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సందీప్.. రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా ఉంది. మరి ఆ సినిమా తర్వాత బన్నీతో సినిమా చేస్తాడా లేదా ప్రభాస్ సినిమా ఆపి బన్నీతో ముందు చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

 

 

అల్లు అర్జున్ కి ఇది 23వ చిత్రం కాగా .. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే సందీప్ వంగతో ప్రభాస్ స్పిరిట్, బన్నీ సినిమాలు రెండిటికి ప్రొడ్యూసర్స్ ఒకరే కావడం విశేషం. మరి ఏ ప్రాజెక్టు ముందు మొదలవుతుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మరోవైపు అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా తర్వాత బోయపాటి కాంబోలో సినిమా ఉంది.

సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా తెరకెక్కిన రా అండ్ రస్టిక్ లవ్ ఇంటెన్స్ స్టోరీ “అర్జున్ రెడ్డి” యూత్ కి బాగా కనెక్ట్ అయి భారీ విజయం సాధించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచి భారీ విహాయం దక్కించుకుంది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో “కబీర్ సింగ్” పేరుతో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కించగా ఈ సినిమా కుడా మంచి విజయం సాధించింది. దీంతో సందీప్ పేరు బాలీవుడ్ లో కూడా మారుమ్రోగిపోయింది. ఈ సినిమాని భూషణ్ కుమార్ నిర్మాణంలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ నిర్మించింది. ప్రస్తుతం యానిమల్ సినిమాని కూడా ఈ సంస్థే నిర్మించడం విశేషం.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/