Last Updated:

Rohit Sharma: మూడో టెస్టులో టీమిండియా ఓటమి.. దీనిపై రోహిత్ శర్మ ఏమన్నాడంటే?

Rohit Sharma: మూడో టెస్టులో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌ లో తమ బ్యాటింగ్ సరిగాలేదని.. ఆ ఇన్నింగ్స్ లో ఇంకొన్ని ఎక్కువ పరుగులు చేయాల్సిందని రోహిత్ అన్నారు.

Rohit Sharma: మూడో టెస్టులో టీమిండియా ఓటమి.. దీనిపై రోహిత్ శర్మ ఏమన్నాడంటే?

Rohit Sharma: ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘోర పరభావాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో ఆస్ట్రేలియా మెుదటి విజయాన్ని నమోదు చేసుకుంది. మూడో రోజు తొలి సెషన్‌ ఆట కూడా పూర్తి కాకుండానే భారత్‌ నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఛేదించింది. దీంతో తొమ్మది వికెట్ల తేడాతో కంగారు జట్టు విజయాన్ని అందుకుంది.

మ్యాచ్ ఓటమిపై రోహిత్ కీలక వ్యాఖ్యలు.. (Rohit Sharma)

మూడో టెస్టులో ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ మ్యాచ్ లో ఓటమికి గల కారణాలను వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌ లో తమ బ్యాటింగ్ సరిగాలేదని.. ఆ ఇన్నింగ్స్ లో ఇంకొన్ని ఎక్కువ పరుగులు చేయాల్సిందని రోహిత్ అన్నారు. మెుదటి ఇన్నింగ్స్ విలువ ఏంటో అర్ధమయిందని మీడియాకు వెల్లడించాడు. ఆసీస్ మెుదటి ఇన్నింగ్స్ లో 90 పరుగుల దాకా ఆధిక్యం లభించినపుడైనా.. రెండో ఇన్నింగ్స్ లో మేం మెరుగ్గా బ్యాటింగ్‌ బ్యాటింగ్‌ చేయాల్సింది. కానీ విఫలమయ్యాం.. కేవలం 75 పరుగులు మాత్రమే చేయగలిగమన్నాడు. తొలి ఇన్నింగ్స్‌ లో బాగా ఆడి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేదని రోహిత్ అభిప్రాయపడ్డాడు. నాలుగో టెస్టుపై దృష్టి పెట్టామని.. టెస్టు ప్రపంచకప్ ఫైనల్ గురించి ఆలోచించడం లేదని రోహిత్ వ్యాఖ్యనించాడు. అహ్మదాబాద్‌ వేదికగా జరిగే నాలుగో టెస్టులో ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న అంశం మీదే దృష్టి సారించినట్లు రోహిత్ పేర్కొన్నాడు.

అద్భుతంగా బౌలింగ్ చేశారు.

మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు అద్భుతంగా రాణించారని రోహిత్ అన్నాడు. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్‌ లియోన్‌ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడని రోహిత్ అన్నాడు. తొలి రెండు టెస్టుల్లో రాణించినంతగా మూడో టెస్టులో రాణించలేదని.. ఇక నాలుగో టెస్టులో తమ వ్యూహాలను కచ్చితంగా అమలు చేస్తామని రోహిత్ వివరించాడు.

మూడు రోజుల్లోనే ముగిసిన ఆట..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో ఏ మ్యాచ్ కూడా మూడు రోజులకు మించి జరగడం లేదు. మెుదటి రెండు మ్యాచులు మూడు రోజుల్లోనే ముగియగా.. తాజాగా మూడో టెస్టు కూడా ముచ్చటగా మూడు రోజుల్లోనే ముగిసింది. ఇక మెుదటి రెండు ఇన్నింగ్స్ లలో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ ముందు నిర్ధేశించిన లక్ష్యం చిన్నదే కావడంతో.. ఆసీస్ జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. దీంతో భారత్‌ఫై ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యం 2-1కి తగ్గింది. ఇక చివరి టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌ వేదికగా ప్రారంభం కానుంది.

రెండో బంతికే వికెట్.. అయిన ఓటమి

76 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ కు మెుదటిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ లోనే ఆ జట్టు వికెట్ కోల్పోయింది. దీంతో ఈ మ్యాచ్ లో భారత్ పట్టు సాధిస్తుందని అంతా అనుకున్నారు. అశ్విన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే.. ఉస్మాన్ ఖవాజా కీపర్‌ శ్రీకర్ భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తొలి వికెట్ తొలి ఓవర్లోనే కోల్పోవడంతో.. ఆసీస్ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. వన్ డౌన్ లో వచ్చిన లబుషేన్, ట్రావిస్‌ హెడ్ తో కలిసి మ్యాచ్ ను పూర్తి చేశారు. ట్రావిస్‌ హెడ్ తో 49 పరుగులతో రాణించాడు. భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికి ఛేదనను తేలిక చేశారు. రెండో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించారు.