Aishwarya Rajesh on LOVE: రెండు బ్రేకప్‌లు.. రిలేషన్‌లో ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా: ఐశ్వర్య రాజేష్!

Aishwarya Rajesh About love and Break up: సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఇందులో భాగ్యం పాత్రలో స ఆకట్టుకుంటుంది. అచ్చతెలుగు అమ్మాయిల సంప్రదాయంగా కనిపించి తెలుగు ఆడియన్స్‌ని మెప్పించింది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం హిట్ జోష్‌లో ఉన్న ఆమె వరుసగా ఇంటర్య్వూలో ఇస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్, లవ్, బ్రేకప్‌పై నోరు విప్పింది.
ప్రేమలో ఉన్నప్పుడు వేధింపులు ఎదుర్కొనాన్నాని చెప్పింది. ఆమె మాట్లాడుతూ. తన కెరీర్‌పై తాను ఎంతో గర్వంగా ఉన్నానని చెప్పింది. ఎలాంటి సపోర్టు లేకుండా సొంతంగా సినిమాల్లోకి వచ్చి.. నచ్చని సినిమాలు చేసుకుంటూ ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొంది. “నాకు మా అమ్మ స్ఫూర్తి. మా అమ్మ-నాన్నలకు నలుగురు సంతానం. నాన్న (ఒకప్పటి హీరో రాజేష్) మా చిన్నతనంలోనే చనిపోయారు. మమ్మల్ని పెంచేందుకు అమ్మ చాలా కష్టపడింది. ఈ ప్రయాణంలో తను ఎన్నో మానసిక ఇబ్బందులు ఎదుర్కొంది.
అమ్మకు అండగ ఉండాలనే ఉద్దేశంతో చిన్న వయసులోనే పార్ట్‌టైం జాబ్స్ చేస్తూ చదువుకున్నాను. ఆ తర్వాత అనుకోకుండ సినిమాల అవకాశాలు వచ్చాయి. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. నాకు నచ్చిన సినిమాలు ఎంచుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత లవ్, బ్రేకప్‌పై నోరు విప్పింది. ప్రస్తుతం తాను సింగిల్ అని చెప్పింది. అయితే గతంలో తాను రెండుసార్లు ప్రేమలో ఉన్నానని చెప్పింది.
“ప్లస్ 2లో ఓ వ్యక్తిని ప్రేమించాను. నన్ను ప్రేమిస్తూ మరో అమ్మాయితో కూడా డేటింగ్ చేశాను. తను ఎవరో కాదు నా ఫ్రెండ్. ఒకేసారి నాతో నా ఫ్రెండ్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. అది తెలిసి చాలా బాధపడ్డాను. నేను చాలా ఎమోషనల్. ప్రేమ కంటే కూడా బ్రేకప్ అయినప్పుడు చాలా బాధపడ్డాడను. ఆ బాధ అంటే నాకు భయం. బ్రేకప్ వల్ల కలిగిన బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కూడా ఓ వ్యక్తిని ప్రేమించాను. కొన్ని కారణాల వల్ల అది కూడా బ్రేకప్ అయ్యింది. ఈ రెండు రిలేషన్‌లో కూడా నేను చాలా వేధింపులు ఎదుర్కొన్నా. ఎందుకు ప్రేమలో ఇలా జరుగుతుంది? అని భయపడ్డా. ప్రస్తుతం సింగిల్ చాలా ప్రశాంతంగా ఉన్నా. గత అనుభవాల వల్ల మళ్లీ ప్రేమలో పడాలంటే భయంగా ఉంది” అని చెప్పుకొచ్చింది