Published On:

Tamannaah Remuneration: వరుస హిట్స్‌.. తమన్నా తేరా నషా ట్రెండీ ఐటెం సాంగ్.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Tamannaah Remuneration: వరుస హిట్స్‌.. తమన్నా తేరా నషా ట్రెండీ ఐటెం సాంగ్.. రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Tamannaah Remuneration for ‘Tera Nasha’ Song: ఆ మాధ్య కాస్తా స్లో అయిన తమన్నా కెరీర్‌ మళ్లీ ఊపందుకుంది. ఓ పక్క హీరోయిన్‌గా చేస్తూనే మరోపక్క ఐటెం సాంగ్‌లో నటిస్తోంది. ఇలా రెండు చేతులా బాగా సంపాదిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాలు తమన్నా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఆమె కెరీర్‌లో చెప్పుకోద్ద హిట్‌ లేకపోయినా.. ఈ అమ్మకి మాత్రం అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో దశాబ్ధంపైగా స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై ఎక్కువగా ఫోకస్‌ పెట్టిన ఆమె వెబ్‌ సిరీస్‌, స్పెషల్‌ సాంగ్స్‌లో నటిస్తోంది. గతేడాది ‘స్త్రీ 2’లో ఆమె నటించిన ‘ఆజ్‌కి రాత్‌’ పాట ఎంతటి సెన్సేషన్‌ అయ్యిందో తెలిసిందే.

 

వందల మిలియన్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ పాట మారుమ్రోగుతూనే ఉంది. ఈ పాటలో తమన్నా వేసిన హుక్‌ స్టెప్‌ బాగా ఫేమస్‌ అయ్యింది. దీంతో ఇప్పుడు బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌ అంటే తమన్నా పేరునే చెబుతున్నారు. ఆజ్‌ కి రాత్‌తో ఓ నార్త్‌, సౌత్‌లో ఓ ఊపు ఊపిన తమన్నా తాజాగా తేరా నషా అంటూ మరో ఐటెం సాంగ్‌తో వచ్చింది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ‘రైడ్‌ 2’లో తేరా నషా అనే ఐటెం సాంగ్‌ని ప్లాన్‌ చేశారు. తమన్నా నటించిన ఈ పాటను ఇటీవల విడుదల చేయగా.. ఈ పాటకు ఆడియన్స్‌ నుంచి భారీ రెస్పాన్స్‌ వచ్చింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ యూట్యూబ్‌ ట్రెండింగ్‌ జాబితాలో ఉంది.

 

అయితే ఈ పాట కోసం తమన్నా తీసుకున్న రెమ్యునరేషన్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. హీరోయిన్‌గా రూ. 4 నుంచి రూ.5 కోట్లు తీసుకునే తమన్నా ఐటెం సాంగ్స్‌ కోటి నుంచి రెండు కోట్లు తీసుకుంటుందట. తాజాగా తేరా నషా పాట కోసం ఆమె రూ. కోటి నుంచి కోటిన్నర తీసుకున్నట్టు సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ఐదు నిమిషాలకు ఈ రేంజ్‌లో పారితోషికంగా అందుకోవడంతో నెటిజన్స్‌ సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. మరోవైపు తెలుగు ‘ఓదెల 2’ మూవీ చేస్తోంది తమన్నా. ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌ ఈ సినిమా తెరకెక్కింది. డైరెక్టర్‌ సంపత్‌ నంది కథ అందించిన ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. ఏప్రిల్‌ 17న ఓదెల 2 ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం తమన్నా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.