‘Odela-2’ Trailer: గోమాత ఉచ్చ అమ్మి కూడా బతకొచ్చు.. భయపెడుతున్న ఓదెల 2 ట్రైలర్!

Tamanna Bhatia’s ‘Odela 2’ Trailer out: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓదెల 2. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్స్ పై మధు నిర్మిస్తున్నాడు. 2022 లో రిలీజైన ఓదెల రైల్వే స్టేషన్ సినిమాకు సీక్వెల్ గా ఓదెల 2 తెరకెక్కింది. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఇప్పటికే ఓదెల 2 నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 17 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దేవుడికి, దెయ్యానికి మధ్య జరిగే పోరాటం ఈ సినిమా.
పార్ట్ 1 లో రాధ(హెబ్బా పటేల్).. తన భర్త అయిన తిరుపతి(వశిష్ట ఎన్ సింహ)ని హత్య చేస్తుంది. ఇక పార్ట్ 2 లో తిరుపతి ఆత్మ.. ఓదెలను చుట్టుముడుతుంది. రాధతో పాటు ఓదెల మొత్తాన్ని నాశనం చేయాలనీ తిరుపతి చూస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే ఓదెలను రక్షించడానికి శివశక్తి( తమన్నా) వస్తుంది. దుష్ట ఆత్మ అయిన తిరుపతికి, పరమాత్మ సేవకురాలైన శివశక్తికి మధ్య జరిగే పోరులో ఎవరు గెలిచారు. శివశక్తి ఓదెలను కాపాడుతుందా.. ? తిరుపతి ఆత్మ రాధను బలి తీసుకుందా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ గ్యారెంటీ. సినిమాకు హైలైట్ అంటే తమన్నానే. ఆమె చెప్పే డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ” మనం నిలబడాలంటే భూమాత.. మనం బ్రతకాలంటే గోమాత. మీరు బ్రతకాలంటే వాటిని చంపనవసరం లేదు. వాటి ఉచ్చ అమ్ముకొని కూడా బతకొచ్చు” డైలాగ్ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో తమన్నా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.