Published On:

Odela 2 OTT Partner: తమన్నా ‘ఓదెల 2’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్‌ – డిజిటల్స్‌ రైట్స్‌ ఎంతో తెలుసా..?

Odela 2 OTT Partner: తమన్నా ‘ఓదెల 2’ ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్‌ – డిజిటల్స్‌ రైట్స్‌ ఎంతో తెలుసా..?

Tamannaah’s Odela 2 Locked OTT Partner Before Release: తమన్నా లీడ్‌ రోల్లో నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘ఓదెల 2’. ఏప్రిల్‌ 17న పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో మూవీ టీం ఓదెల 2 ప్రమోషన్స్‌ని జోరు పెంచేసింది. ఇందులో భాగంగా మంగళవారం ముంబైలో ఓదెల 2 ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌ నిర్వహించి విడుదల చేశారు. తమన్నా నాగసాధువుగా నటిస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్‌ క్రియేట్‌ అయ్యింది. సినిమా ప్రచార పోస్టర్స్‌, గ్లింప్స్‌, టీజర్‌తో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక నిన్న విడుదైన ట్రైలర్‌ ‘ఓదెల 2’పై అంచనాలను మరింత రెట్టింపు చేసింది.

 

ఓదెల 2 ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్

దీంతో ఓదెల 2 మూవీపై మంచి బజ్‌ నెలకొంది. దీంతో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌ బాగానే జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు విడుదలకు ముందే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ కూడా జరిగినట్టు సమాచారం. ‘ఓదెల 2’ డిజిటల్‌ రైట్స్‌ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీపడగా.. చివరికి అమెజాన్‌ ప్రైం మూవీ రైట్స్‌ని సొంతం చేసుకుంది. సుమారు రూ. 18 కోట్లకు ఓదెల 2 డిజిటల్‌ రైట్స్‌ అమ్ముడుపోయినట్టు ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇక శాటిలైట్‌ రైట్స్‌ గురించి కూడా చర్చలు జరుగుతున్నాయట. దీంతో రిలీజ్‌కు ముందే ఓదెల 2 మేకర్స్‌ లాభాల్లో పడినట్టు సమాచారం. థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ కలిపి మంచి లాభాలు వచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 

కాగా 2022లో వచ్చిన ఓదెల రైల్వేస్టేషన్‌కు ఈ సినిమా సీక్వెల్‌ అనే విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అశోక్‌ తేజ దర్శకత్వంలో హెబ్బా పటేల్‌, వశిష్ట ఎన్‌ సింహ ప్రధాన పాత్రల్లో క్రైం, థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఓటీటీ విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమా సీక్వెల్‌గా ‘ఓదెల 2’ని తీసుకువచ్చారు మేకర్స్‌. డైరెక్టర్‌ సంపత్‌ నంది కథ అందించగా.. తొలి పార్ట్‌కు దర్శకత్వం వహించిన అశోక్‌ తేజనే సీక్వెల్‌కు కూడా దర్శకత బాధ్యతలు తీసుకున్నారు. మధు క్రియేషన్స్, సంపత్‌ నంది టీం వర్క్‌ సంస్థలపై డి మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో తమన్నా లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా.. హెబ్బా పటేల్‌, వశిష్ట ఎన్‌ సింహ, యువ, నాగ మహేష్‌, వంశీ, గగన్‌ విహారి, సురేందర్‌ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.