Tamannaah Bhatia: బ్రేకప్ తరువాత తమన్నా.. ఎలా మారిపోయిందో చూడండి

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అందం, అభినయం కలబోసిన హీరోయిన్స్ లో తమన్నా కూడా ఒకరు. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

ఇక సినిమాలతోనే కాదు ఐటెంసాంగ్స్ తో తమన్నా మెప్పించింది. హీరోయిన్స్ లో ఎక్కువ స్పెషల్ సాంగ్స్ చేసిన హీరోయిన్ గా తమన్నా రికార్డ్ సృష్టించింది.

తెలుగులో అవకాశాలు తక్కువ అవ్వడంతో తమ్ము బాలీవుడ్ పై ఫోకస్ చేసింది.

బాలీవుడ్ కి వెళ్ళాకా అమ్మడికి విజయ్ వర్మ పరిచయమయ్యాడు.

నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమాయణం మొదలుపెట్టింది. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. తమన్నా - విజయ్ వర్మ విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో తమన్నా.. విజయ్ తో ఉన్న ఫోటోలను డిలీట్ చేసింది.

ప్రస్తుతం తమన్నా- విజయ్ ల మధ్య ప్రేమ లేదని, వారు స్నేహితులుగా కొనసాగుతున్నారని బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది.

ఇక బ్రేకప్ తరువాత తమన్నా కెరీర్ మీద ఫోకస్ చేసింది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా తమ్ము రెడ్ అండ్ బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో అప్సరసలా మెరిసిపోయింది.

అయితే బ్రేకప్ తరువాత తమ్ము ముఖంలో గ్లో మిస్ అయ్యిందని, ఫేస్ అంతా డల్ గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.