Published On:

Tamannaah Bhatia: నా 21 వ బర్త్ డే రోజు.. పేపర్ లో ఆ వార్త చూసి ఏడ్చేశాను

Tamannaah Bhatia: నా 21 వ బర్త్ డే రోజు.. పేపర్ లో ఆ వార్త చూసి ఏడ్చేశాను

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో అమ్మడు తెలుగుతెరకు పరిచయమైంది. దానికి ముందే తమిళ్ లో కొన్ని సినిమాలు చేసింది. అవి తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే అవేమి తమన్నాకు అంతగా విజయాన్ని అందించలేదు. హ్యాపీ డేస్ సినిమా తమన్నా జీవితాన్నే మార్చేసింది.

 

ఇక హ్యాపీడేస్ తరువాత మిల్కీ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్ భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించి నెంబర్ 1 హీరోయిన్ గా ఎదిగింది. తమ్ము నటన ఒక ఎత్తు అయితే.. ఆమె అందం మరో ఎత్తు. ముఖ్యంగా  తమన్నా నడుముకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నారనే చెప్పాలి. మరోపక్క డ్యాన్స్ తో కూడా తన సత్తా చాటింది. హీరోయిన్లు ఐటెంసాంగ్స్ చేయరు అన్న అపోహను తమన్నానే తొలగించింది అని చెప్పొచ్చు. ఎక్కువ ఐటెంసాంగ్స్ లో  మెరిసిన హీరోయిన్ గా తమన్నా రికార్డ్ సృష్టించింది అని చెప్పొచ్చు.

 

ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ కు అంకితం అయ్యిపోయింది. నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం అనుకున్నంత సేపు పట్టలేదు విడిపోవడానికి. లవర్స్ గా  గతేడాది మొత్తం కనిపించిన ఈ జంట ఇప్పుడు ఫ్రెండ్స్ గా అడపాదడపా కనిపిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా ఓదెల 2 సినిమాలో నటిస్తోంది.  సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 18 న రిలీజ్ కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన తమన్నా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా విషయాలతో పాటు తన గతం తాలూకు జ్ఞాపకాలను కూడా నెమరువేసుకుంది.

 

” నేను పదవ తరగతి చదువుతున్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను స్కూల్ చదువుతున్నప్పుడు టీచర్స్ ఎంతగానో హెల్ప్ చేశారు. కొన్నిసార్లు వాళ్లే నా అస్సైన్మెంట్స్ పూర్తిచేసేవారు. ఇప్పటికీ నేను వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. స్కూల్ తరువాత నేను కాలేజ్ కు వెళ్ళలేదు. ఆ బాధ ఇప్పటికీ ఉంది. కానీ, సినిమాల్లో కాలేజ్ స్టూడెంట్ గా  నటించాను. నేను ఇండస్ట్రీకి వచ్చి అప్పుడే 20 ఏళ్ళు అవుతుంది. నేనెప్పుడూ సినిమాను ఒక పనిలా చూడలేదు. ఎంతో ఇష్టంగా చేసేదాన్ని. ఇప్పుడు తలుచుకుంటే అప్పుడే ఇంత దూరం వచ్చేసేనా అనిపిస్తుంది. అసలు ఇన్నేళ్లు నేను ఇండస్ట్రీలో ఉంటానని అనుకోలేదు.

 

ఈ 20 ఏళ్ళ కెరీర్ లో నా 21 వ పుట్టినరోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆరోజు బర్త్ డే కావడంతో షూటింగ్స్ బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే ఉన్నాను. ఆరోజు పేపర్ లో నా గురించి రాశారు.  తమిళ్ ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్ అని రాశారు. అది చూసి నేను ఏడ్చేశాను. అసలు నేనుఅంత ఎదుగుతాను అని అనుకోలేదు. ఆ తరువాత ఆ స్థాయికి వెళ్ళాకా.. దాన్ని కొనసాగించడం కష్టమని అర్ధమయ్యింది. అయినా.. తడబడకుండా సినిమాలు చేస్తూ వచ్చాను. ఈ స్థాయికి చేరుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. మరి ఓదెల 2 తో తమన్నా తెలుగులో మళ్లీ బిజీ అవుతుందా అనేది చూడాలి.