Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదు!

Earthquake in Indonesia, German Research Centre for Geosciences declared 6.3 Magnitude: ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. దేశంలోని బెంగుకులుకు నైరుతి దిశలో 6.3 భూకంప తీవ్రతతో సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. ఆ దేశ సమయం ప్రకారం.. ఉదయం 7.52 నిమిషాలకు 10కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు తెలిపింది. బెంగుకులుకు సుమార్ 43 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగలేదని వెల్లడించింది.