Published On:

Tamannaah on Marriage: బ్రేకప్‌ వార్తలు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్నా.. ఏం చెప్పిందంటే..?

Tamannaah on Marriage: బ్రేకప్‌ వార్తలు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్నా.. ఏం చెప్పిందంటే..?

Tamannaah comments on Her Marriage: మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన ‘ఓదెల 2’ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న ఆమెకు తాజాగా పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. దీనికి తమన్నా ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా?

 

రెండేళ్లు విజయ్ వర్మతో చెట్టాపట్టాల్..!

ఈ మధ్య తమన్నా పేరు బాగా వినిపిస్తోంది. ఇటూ ప్రొఫెషనల్‌ అటూ పర్సనల్‌ లైఫ్‌లో తరచూ వార్తల్లో నిలుస్తోంది. సినిమాలు ఐటెం సాంగ్స్‌ చేస్తూ కెరీర్‌ పరంగా దూసుకుపోతుంది. దాదాపు ఐదేళ్లుగా ఆమె ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అయితే కొద్ది రోజులుగా తమన్నా తన బ్రేకప్‌ వార్తలతో హాట్‌టాపిక్‌గా మారింది. మొన్నటి వరకు నటుడు విజయ్‌ వర్మతో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఏ సినిమా ఈవెంట్‌లో అయిన వీరిద్దరి సందడే బాగా కనిపించేది. రెండేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న వీరిద్దరు ఈ మధ్య బ్రేకప్‌ చెప్పుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై వీరి నుంచి అధికారిక ప్రకటన లేకపోయిన తమన్నా-విజయ్‌ విడిపోయారంటూ గట్టి ప్రచారం జరుగుతుంది.

 

పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?

కొన్ని సంఘటనలు కూడా ఇవి నిజమేనేటట్టే ఉన్నాయి. ఎప్పుడు జంటగా తిరిగే వీరిద్దరు ఈ మధ్య సింగిల్‌గా కనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లిన ఒంటరిగా వెళుతున్నారు. ఇటీవల ఒకే హోలీ వేడుకలో పాల్గొన్న ఇద్దరు కనీసం చూసకోలేదట. ఈవెంట్‌కి ఇద్దరు వేరు వేరుగానే వచ్చి వెళ్లారు. ఇవన్నీ కూడా వారి బ్రేకప్‌ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. బాలీవుడ్‌ మీడియాలో తమన్నా-విజయ్‌ బ్రేకప్‌ వార్తలు మారుమ్రోగుతున్న వీరద్దరు కనీసం పెదవి విప్పడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓదెల 2 ప్రమోషన్స్‌లో భాగంగా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న తమన్నాను ఓ విలేకరి ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?’ అని ప్రశ్నించారు.

 

పెళ్లిపై తమన్నా కామెంట్స్..!

దీనికి తమన్నా స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఆలోచన లేదంటూ పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. తమన్నా రిప్లైతో తమన్నా-విజయ్‌ల బ్రేకప్‌ వార్తలపై మరింత క్లారిటీ వచ్చిందంటున్నారు నెటిజన్స్‌. ఆఫర్లు లేక చిన్న సినిమాల్లో నటిస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు.. తన దృష్టిలో చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేదన్నారు. “టెంట్‌ బాగుంటే పెద్ద సినిమా అవుతుంది, బాగోకపోతే చిన్న సినిమా అవుతుంది. కెరీర్‌ ప్రారంభంలో నేను నటించిన హ్యాపీడేస్‌ మూవీలో ఎనిమిది ప్రధాన పాత్రలో నాది ఒకటి. నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. అందుకే బాలీవుడ్‌ చిత్రం స్త్రీ 2లో స్పెషల్‌ సాంగ్‌ చేశాను. కానీ, అది అంత పెద్ద హిట్‌ అవుతుంని అస్సలు ఊహించలేదు. ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది, ఏది ఆకట్టుకోలేదనే విషయాన్ని మనం చెప్పలేం” అని చెప్పుకొచ్చింది.