Last Updated:

NTR: నీకో స్పెషల్ గిఫ్ట్.. రిపోర్టర్ ను సర్ ప్రైజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

NTR: నీకో స్పెషల్ గిఫ్ట్.. రిపోర్టర్ ను సర్ ప్రైజ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

NTR: భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్(RRR) కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాకు అవార్డులు మీద అవార్డులు వచ్చి పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను గెలుచుకున్న ఈ చిత్రం మరో ప్రతిష్టాత్మక అవార్డు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డులకు కూడా నామినేట్ అయిన విషయం తెలిసిందే. రెండు కేటగిరీల్లో అవార్డ్‌ కోసం ఈ మూవీ పోటీ పడింది. బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీ, బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ఆర్ఆర్ఆర్ పోటీ పడుతుంది. కాగా తాజాగా బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరీలో ‘నాటు నాటు’అవార్డును కైవసం చేసుకుంది. మరికాసేపట్లో బెస్ట్‌ నాన్ ఇంగ్లీష్‌ కేటగిరీలో విన్నర్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు.

నీకో స్పెషల్ గిఫ్ట్

ఈ అవార్డు ను సినిమా సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. లాస్ఏంజెల్స్ లో జరిగిన ఈ అవార్డుల ఫంక్షన్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్(Ram Charan-Upasana),రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా వెళ్లారు. రెడ్ కార్పెట్ పై స్టైలిష్ లుక్స్ తో రామ్ చరణ్, భారతీయత ఉట్టిపడేలా ఉపాసన జంట అదరగొట్టారు. అదే విధంగా యంగ్ టైగర్ కూడా సతీమణి ప్రణతితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్ అక్కడి మీడియాతో మాట్లుడుతూ.. రిపోర్టర్ ను సర్ ప్రైజ్ చేశాడు. తనతో ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్ట్ పుట్టిన రోజు అని తెలుసుకున్న ఎన్టీఆర్ ‘ ఈ రోజు నీ పుట్టిన రోజు.. అందుకే నా తరపున నీకు ఓ స్పెషల్ గిఫ్ట్.. చిన్నదే అయినా గిఫ్ట్ నీకు బాగా నచ్చుతుంది.. హ్యాపీ బర్త్ డే మ్యాన్..’ అంటూ అతడి చేతిలో బహుమతి పెట్టాడు. దీంతో ఒక్కసారిగా సర్ ఫ్రైజ్ అయిన ఆ జర్నలిస్ట్ తారక్ ను కౌగిలించుకుని థ్యాంక్స్ చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌(Jr NTR) లు కలిసి నటించారు. ఆలానే ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్‌ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్‌ లోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి ఇటీవలే బెస్ట్‌ డైరెక్టర్‌గా ఆర్ఆర్ఆర్ మూవీకి రాజమౌళి అందుకున్నారు.

 

ఇవి కూడా చదవండి…

3200 కిలో మీటర్ల నదీ విహారం.. గంగా విలాస్ అద్భుత యాత్ర

సైలెంట్‌గా ఉపాసన ఎంట్రీ.. భార్యను రాంచరణ్ ఎలా పరిచయం చేశాడో చూడండి..

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. బెస్ట్ సాంగ్ గా “నాటు నాటు”

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: http://Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

ఇవి కూడా చదవండి: