Published On:

Thammudu: అన్నయ్య రావడం లేదు.. తమ్ముడు వస్తున్నాడట.. ?

Thammudu: అన్నయ్య రావడం లేదు.. తమ్ముడు వస్తున్నాడట.. ?

Thammudu: ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అస్సలు అర్ధం కావడం లేదు.  రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక మూడు సినిమాల రిలీజ్ డేట్స్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. అవే.. కింగ్డమ్, తమ్ముడు, విశ్వంభర. ఈ మూడు సినిమాలపై కూడా అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మొదటి నుంచి కింగ్డమ్.. మే 30 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ చెప్పుకొచ్చారు.

 

అదే రోజు హరిహర వీరమల్లు రిలీజ్ అయితే కనుక కింగ్డమ్ వెనక్కి వెళ్తుంది. కానీ, హరిహర వీరమల్లు మే 30 కి వస్తుంది అనే నమ్మకం అప్పుడు ఎవరికి లేదు. అందుకే ముందుగా నాగవంశీ మే 30 ని లాక్ చేశాడు. కానీ, చివరకు వీరమల్లు అదే డేట్ ను వస్తుంది అని తెలియడంతో.. తప్పక కింగ్డమ్ వెనక్కి వెళ్లి జూన్ 4 న రావడానికి రెడీ అయ్యింది. మరి జూన్ 4 న రిలీజ్ కావాల్సిన తమ్ముడు పరిస్థితి ఏంటి.. ? అంటే.. పోటీ లేకుండా కొత్త డేట్ చూసుకుంటాం అంటూ త్యాగం చేసి తమ డేట్ ను కింగ్డమ్ కి ఇచ్చేసింది.

 

ఇక్కడ వరకు రెండు సినిమాల రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇక ఇప్పుడు వెనక్కి వెళ్లిన తమ్ముడు.. ఎప్పుడొస్తాడు అనేది చర్చనీయాంశంగా మారింది. జూన్ 4 నుంచి మొదలైతే.. చివరివరకు సినిమాలు వస్తూనే ఉన్నాయి. జూన్ ని వదిలేస్తే జూలై. అదే నెలలో మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ కానుందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. జూలై 24 న విశ్వంభర కచ్చితంగా రిలీజ్ అవుతుందని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

 

కానీ, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ డేట్ ను మెగాస్టార్ వదిలేసుకున్నాడని తెలుస్తోంది. దీంతో ఎప్పటి నుంచో కాచుకొని కూర్చున్న తమ్ముడు.. ఆ డేట్ ను పట్టేసాడు. జూలై 25 న తమ్ముడు రిలీజ్ కానుందని.. ఇది ఫిక్స్ అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. నిజం చెప్పాలంటే మెగాస్టార్ చాలా మంచి డేట్ ను వదిలేసుకున్నాడని అంటున్నారు. అన్నయ్య మిస్ అయినా ఆ డేట్ ను తమ్ముడు ఒడిసిపట్టేశాడు. మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

ఇవి కూడా చదవండి: