Published On:

Motorola Edge 50 Pro: కొత్త ఫోన్ వస్తూ.. పాత ఫోన్ ధర తగ్గించింది.. కొంటే ఇప్పుడే కొనండి..!

Motorola Edge 50 Pro: కొత్త ఫోన్ వస్తూ.. పాత ఫోన్ ధర తగ్గించింది.. కొంటే ఇప్పుడే కొనండి..!

Motorola Edge 50 Pro: జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను ఈరోజు అంటే ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాకముందే మోటరోలా పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ Motorola Edge 50 Pro ధర భారీగా పడిపోయింది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోను కంపెనీ గత ఏడాది ఏప్రిల్‌లో చాలా ఎక్కువ ధరకు విడుదల చేసింది. కానీ, ఇప్పుడు తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

 

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో అనేది కంపెనీ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ప్రాసెసర్ నుండి చిప్‌సెట్ వరకు, మోటరోలా ఇందులో చాలా ఫీచర్లను ఇచ్చింది. మీరు ఫోటోగ్రఫీ లేదా గేమింగ్ ప్రేమికులైతే, ఈ స్మార్ట్‌ఫోన్ సరైన ఎంపిక. ఫ్లిప్‌కార్ట్ తన కోట్లాది మంది వినియోగదారులకు ఈ ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

 

Motorola Edge 50 Pro Offers
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 41,999కి అందుబాటులో ఉంది. ప్రస్తుతం దీనిపై వినియోగదారులకు 28శాతం భారీ తగ్గింపును ఇస్తోంది. మోటరోలా ఈ ప్రీమియం ఫోన్‌పై ఇంత పెద్ద తగ్గింపును అందించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మీరు ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుండి కేవలం రూ. 29,999కి కొనుగోలు చేయవచ్చు.

 

ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లకు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తే మీకు 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది కాకుండా మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో అతిపెద్ద పొదుపు చేయచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో మీ పాత ఫోన్‌ను రూ. 27,700 వరకు మార్చుకోవచ్చు. అయితే, మీరు ఎంత ఎక్స్‌ఛేంజ్ వాల్యూ అనేది ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. రూ.20 వేలు కూడా ఎక్స్ఛేంజ్ విలువ పొందినట్లయితే, మీరు ఈ ఫోన్‌ను రూ.10 వేల లోపే దక్కించుకోవచ్చు.

 

Motorola Edge 50 Pro Specifications
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో అల్యూమినియం ఫ్రేమ్‌, ఎకో లెదర్ బ్యాక్ ఫినిషింగ్‌ డిజైన్‌‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల P-OLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటక్షన్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో అవుట్ ఆప్ ది బాక్స్ రన్ అవుతుంది. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ ఉంది. 12జీబీ ర్యామ్, 512జీబీ వరకు స్టోరేజ్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50+10+13 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెన్సార్ ఉంది.సెల్ఫీ మరియు వీడియో కాలింగ్ కోసం 50MP కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 125W ఫాస్ట్ ఛార్జింగ్‌‌తో పెద్ద 4500mAh బ్యాటరీ ఉంది.