Vivo Y37c Launched: బడ్జెట్ ప్రియుల కోసం.. వివో నుంచి సరికొత్త ఫోన్.. చౌక ధరకే మంచి ఫీచర్స్..!

Vivo Y37c Launched: వివో కొన్ని రోజుల క్రితం బడ్జెట్ రేంజ్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు Vivo Y37, Vivo Y37m లను విడుదల చేసింది. దీని తర్వాత, కంపెనీ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో కూడిన Vivo Y37 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తన స్వదేశీ మార్కెట్ చైనాలో Vivo Y37cని విడుదల చేసింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.
Vivo Y37c Features And Specifications
Vivo Y37c స్మార్ట్‌ఫోన్ 6.56-అంగుళాల LCD స్క్రీన్‌ను వాటర్‌డ్రాప్ నాచ్‌తో ఉంది. ఈ డిస్‌ప్లే రిజల్యూషన్ HD ప్లస్, రిఫ్రెష్ రేట్ 90Hz, బ్రైట్‌నెస్ 570 నిట్స్. దీనితో పాటు, ఈ ఫోన్‌లో డిస్‌ప్లేకి ఐ ప్రొటక్షన్ ఫీచర్లు కూడా అందించారు. బ్లూ లైట్‌ని తగ్గిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP64- రేటింగ్‌తో వస్తుంది. ఇది దుమ్ము, నీటి నుండి రక్షణ కల్పిస్తుంది.
ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే.. వివో Y37c స్మార్ట్‌ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. దీనితో పాటు, వెనుక కెమెరా సెన్సార్ విషయానికి వస్తే ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఈ వివో ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OriginOS 4 పై రన్ అవుతుంది.
వివో Y37c స్మార్ట్‌ఫోన్ Unisoc T7225 చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. ఈ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్, మెరుగైన పనితీరు కోసం దీనికి వర్చువల్ RAM సపోర్ట్ కూడా అందించారు. ఈ వివో ఫోన్‌లో 5500mAh బ్యాటరీ ఉంది. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో డ్యూయల్ సిమ్ 4G, Wi-Fi 5, బ్లూటూత్ 5.2, USB-C, 3.5మిమీ ఆడియో జాక్ ఉన్నాయి.
Vivo Y37c Price
Vivo Y37c స్మార్ట్‌ఫోన్ ధర చైనాలో 1199 యువాన్ (సుమారు 14 వేల రూపాయలు). ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో డార్క్ గ్రీన్, టైటానియం కలర్ ఆప్షన్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. భారతదేశం, ఇతర మార్కెట్లలో ఈ ఫోన్ లాంచ్ గురించి వివో ఇంకా ఎటువంటి సమాచారాన్ని పంచుకోలేదు.
ఇవి కూడా చదవండి:
- OnePlus 13s Launch: వన్‌ప్లస్ నుంచి బిగ్ సర్పైజ్.. OnePlus 13s రాబోతోంది.. ఇక దీనికి తిరుగులేదు..!