Amazon Biggest Mobile Offer: సూపర్ ఆఫర్లు భయ్యా.. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. చౌకైన ధరకే ఇలా కొనేసుకోండి..!

CMF Phone 1 Massive Price Cut: సీఎంఎఫ్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ CMF Phone 2 Proను నేడు భారతదేశంతో సహా ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేయబోతోంది. ఈ అల్ట్రా స్లిమ్ ఫోన్ అనేక శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ చేయడానికి ముందు సీఎంఎఫ్ పాత డివైస్ ఫోన్ 1 ధరను భారీగా తగ్గించింది. మొదటిసారిగా, సీఎంఎఫ్ ఫోన్ 1 ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో రూ. 7,600 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది.
మీరు బడ్జెట్ ధరకు మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే సీఎంఎఫ్ ఫోన్ 1 సరైన ఎంపిక కావచ్చు. ఇందులో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8జీబీ ర్యామ్‌తో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఆఫర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
CMF Phone 1 Amazon Offers
సీఎంఎఫ్ ఫోన్ 1 ధర లాంచ్ అయినప్పుడు రూ.21,999గా ఉంది. అయితే ఇప్పుడు అమెజాన్ 35శాతం డిస్కౌంట్ ప్రకటించింది. కాబట్టి, రూ.14,399కి కొనుగోలు చేయచ్చు. అంతేకాకుండా మీరు ఫోన్‌ను ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ఈఎమ్ఐపై ఆర్డర్ చేస్తే రూ.10 శాతం తక్షణ తగ్గింపు అంటే రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. దీని ద్వారా మరింత తక్కువ ధరకు ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.
CMF Phone 1 Specifications
ఈ ఫోన్‌లో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలానే HDR10+ కి సపోర్ట్ ఇస్తుంది. 1 బిలియన్ కంటే ఎక్కువ రంగులను ప్రదర్శించగలదు. దీని పీక్ బ్రైట్నెస్ 2000+ నిట్‌ల వరకు చేరుకుంటుంది. సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.
ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంది, ఇది రెండు రోజుల బ్యాటరీ లైఫ్‌ని ఆప్టిమైజ్ చేస్తుంది. కంపెనీ ప్రకారం, ఇది 22 గంటల పాటు నిరంతరం యూట్యూబ్‌ను ప్లే చేయగలదు. ఫోన్‌లో జియో-మాగ్నెట్ సెన్సార్, గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్ ఉన్నాయి. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 5జీ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. దీని AnTuTu స్కోరు దాదాపు 673,000 ఉంటుందని టెక్ స్పెషలిస్ట్‌లు చెబుతున్నారు. దీనికి 16జీబీ వరకు ర్యామ్ ఉంటుంది.
ఈ పోన్‌లో హాప్టిక్ మోటార్లు, 5G, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి అవసరమైన అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో డిస్‌ప్లే కింద ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వయోలిన్ చాంబర్ లాగా రూపొందించిన దిగువకు ఎదురుగా ఉండే స్పీకర్ ఉన్నాయి. ఇవి బెస్ట్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- SASA LELE: ఫ్లిప్‌కార్ట్ “SASA LELE” సేల్.. ఐఫోన్లు, ఏసీలు, ఫ్రిజ్డ్లపై మెరుపులాంటి డిస్కౌంట్లు.. అమెజాన్‌కు పెద్ద దెబ్బే..!