Vivo V40e 5G: మంచి కెమెరా ఫోన్.. వివో 5జీ మొబైల్‌పై భారీ ఆఫర్లు.. ఫీచర్స్ చూస్తే వదలరుగా..!

Vivo V40e 5G: మొబైల్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నVivo V50 5G ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. ఫోన్ రూ. 34,999 ధరకు అందుబాటులో ఉంది. ఈ vivo మొబైల్ ఇంకా అమ్మకాలను ప్రారంభించలేదు. ఇంతకుముందు, కంపెనీ తన Vivo V40e 5G ఫోన్ ధరను తగ్గించింది. రూ.2,500 తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయిస్తున్నారు. ఈ ఫోన్ బేస్ ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Vivo V40e 5G Offers
వివో V40e 5G ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ. 30,999కి విడుదలైంది. మీరు ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 2,500 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వినియోగదారులందరికీ 2,500 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి బ్యాంక్ కార్డ్ అవసరం లేదు. HDF, IDFC ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫర్ బరోడా, ఫెడరల్ లేదా HSBC క్రెడిట్ కార్డ్ ఉపయోగించి EMI చేస్తే 1000. అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. కేవలం రూ.27,499కే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
Vivo V40e 5G Features
వివో V40e 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.77-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్ప్లే 2,392 × 1,080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారండా Funtouch OS 14లో రన్ అవుతుంది. ఈ vivo మొబైల్‌లో 8GB RAM ఉంది.
వివో V40e 5G డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ మెయిన్ కెమెరా ఉంది. అదనంగా, 8 మెగాపిక్సెల్స్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం Vivo మొబైల్ 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఉంది. మొబైల్‌లో 5500mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. మీరు ఈ ఫోన్‌ను 42 నిమిషాల్లో 20శాతం నుండి 100శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేయచ్చు.