Bajaj Chetak 3503: బజాజ్ చేతక్ నయా ఈవీ.. సింగిల్ ఛార్జ్‌తో 150కి.మీ రేంజ్.. ధర చాలా తక్కువేగా..!

Bajaj Chetak 3503: ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. బజాజ్ కంపెనీ ఈ సెగ్మెంట్‌లో చాలా వేగంగా దూసుకుపోతుంది. చేతక్ ఎలక్ట్రిక్ మోడల్ ద్వారా మంచి ప్రజాధారణ సంపాదిస్తుంది బజాజ్. మార్కెట్లో కూడా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతోంది. దేశంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న చేతక్ తన 35 సిరీస్‌లో కొత్త 3503 మోడల్‌ను విడుదల చేసింది. బజాజ్ చేతక్ 3501, 3502 మోడళ్లను విడుదల చేసిన కొన్ని నెలల తర్వాత, సరికొత్త ‘3503’ మోడల్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్‌ను సరికొత్త డిజైన్, మంచి ఫీచర్లు, తక్కువ ధరతో తీసుకొచ్చారు.
బజాజ్ చేతక్ 3503 మోడల్ ధర రూ. 1.10 లక్షలు ఎక్స్-షోరూమ్. ఇది మధ్యతరగతి వినియోగదారులకు బడ్జెట్‌కు అనుగుణంగా ఉంటుంది. స్కూటర్ డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఇది పాత రెట్రో స్టైల్ డిజైన్‌తో ఉంది. ఇందులో లేటెస్ట్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, కర్వీ బాడీ ప్యానెల్‌లు , టెయిల్ లాంప్‌లు ఉన్నాయి. 35-లీటర్ల పెద్ద బూట్ స్పేస్‌ను కూడా ఉంది. బ్రూక్లిన్ బ్లాక్, ఇండిగో బ్లూ, మ్యాట్ గ్రే, సైబర్ వైట్ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
బజాజ్ చేతక్ 3503 మోడల్ పవర్ ట్రెయిన్ విషయానికి వస్తే 3.5 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ అందించారు. ఈ బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల రేంజ్ (మైలేజ్) ఇస్తుంది. స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 63 కిమీ. దీని బ్యాటరీ ప్యాక్ గృహ విద్యుత్తును ఉపయోగించి 0 నుండి 80శాతం వరకు ఛార్జ్ కావడానికి 3 గంటల 25 నిమిషాలు పడుతుంది. ఇందులో రెండు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి: ఎకో- స్పోర్ట్స్.
కొత్త బజాజ్ చేతక్ 3503 మోడల్‌లో డజన్ల కొద్దీ అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. కలర్ ఎల్‌సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ చూడచ్చు. రైడర్ సేఫ్టీ కోసం మోనోషాక్ సస్పెన్షన్ సెటప్, ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్స్‌ను అందించారు. చేతక్ 2903 ఇ-స్కూటర్ కూడా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ధర రూ. 98,498 నుంచి మొదలై రూ. 1.02 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. 2.88 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని ఫుల్ ఛార్జ్ చేస్తే 123 కిలోమీటర్లు నడుస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 63 కి.మీ.
ఇవి కూడా చదవండి:
- Best Car For Middle Class: మిడిల్ క్లాస్ వారి కోసమే.. మహీంద్రా స్కార్పియో N.. ఆన్ రోడ్ ప్రైజ్, మైలేజ్ ఎంతంటే..?