Published On:

CMF Phone 2 Pro Launched: ఈసారి హిట్ కొట్టినట్టే.. CMF Phone 2 Pro వచ్చేసింది.. ఆఫర్లు, ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

CMF Phone 2 Pro Launched: ఈసారి హిట్ కొట్టినట్టే.. CMF Phone 2 Pro వచ్చేసింది.. ఆఫర్లు, ధర, ఫీచర్లు పూర్తి వివరాలు ఇవే..!

CMF Phone 2 Pro Launched: సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. నథింగ్ సబ్-బ్రాండ్ సీఎంఎఫ్ నుండి వచ్చిన ఈ ఫోన్ గత సంవత్సరం లాంచ్ అయిన సీఎంఎఫ్ ఫోన్ 1 స్థానంలో రానుంది. కంపెనీ తన తాజా స్మార్ట్‌ఫోన్‌ను అనేక అప్‌గ్రేడ్‌లతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ఇప్పుడు ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో మార్కెట్లో లాంచ్ అయింది. ఇందులో టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో చిప్‌సెట్‌తో స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

 

CMF Phone 2 Pro Price
సీఎంఎఎఫ్ ఫోన్ 2 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 18,999 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. దీని రెండవ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 20,999 కు విడుదల చేశారు. ఈ ఫోన్ వైట్, బ్లాక్, ఆరెంజ్, లైట్ గ్రీన్ వంటి కలర్ వేరియంట్స్‌లో కొనుగోలు చేయచ్చు.

CMF Phone 2 Pro Sale Date And Offers
ఈ నథింగ్ ఫోన్ మే 5 నుండి ఫ్లిప్‌కార్ట్, క్రోమా, విజయ్ సేల్స్, రిటైల్ స్టోర్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ల విషయానికి వస్తే కంపెనీ సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోపై రూ. 1000 తగ్గింపును అందిస్తోంది.

 

CMF Phone 2 Pro Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లే‌తో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌‌తో వస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే పాండా గ్లాస్ ప్రొటెక్షన్, HDR10+ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 Pro చిప్‌సెట్‌తో లాంచ్ అయింది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ తో మార్కెట్లోకి వచ్చింది.

 

CMF Phone 2 Pro Camera Features
ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుంటే.. దీనిలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. దీని ప్రైమరీ కెమెరా 50MP, దానితో పాటు 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.

 

CMF Phone 2 Pro Battery
కంపెనీ సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో 5000mAh బ్యాటరీని అందించింది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. భారతదేశంలో కంపెనీ ఈ ఫోన్‌తో ఛార్జర్‌ను కూడా అందిస్తోంది. నథింగ్ నుండి వచ్చిన ఈ సరసమైన ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా నథింగ్ OS 3.2 కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు, 6 సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్‌లతో అందిస్తుందని కంపెనీ తెలిపింది.

 

CMF Phone 2 Pro Features
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP54 రేటింగ్, 2 HD మైక్‌తో విడుదల చేశారు. దీనితో పాటు, ఈ ఫోన్‌లో ఎసెన్షియల్ కీ బటన్ కూడా ఉంటుంది, దీని ద్వారా వినియోగదారులు వివిధ AI టూల్స్‌ను సెట్ చేయచ్చు.