Published On:

iPhone Offers: నమ్మలేని తగ్గింపులు.. ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోపై భారీగా డిస్కౌంట్లు.. ఎలాగంటే..?

iPhone Offers: నమ్మలేని తగ్గింపులు.. ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రోపై భారీగా డిస్కౌంట్లు.. ఎలాగంటే..?

iPhone Offers: మీరు తక్కువ ధరకు కొత్త మోడల్ ఐఫోన్ కొనాలనుకుంటే.. ఇది మీకు సరైన సమయం కావచ్చు. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో వచ్చే నెల నుండి ప్రారంభమయ్యే సేల్‌లో మీరు తక్కువ ధరకు ఐఫోన్‌ను ఇంటికి తీసుకురావచ్చు. అయితే సేల్ ప్రారంభమయ్యే ముందు, మీరు మూడు కొత్త ఐఫోన్ మోడళ్లను ఇప్పటివరకు అత్యల్ప ధరకు కొనుగోలు చేయచ్చు. ఐఫోన్ 15, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో ధరలను వేల రూపాయలు తగ్గించింది. ఈ మూడు మోడళ్ల ఆఫర్లు, ధరలు తదితర వివరాలు తెలుసుకుందాం.

iPhone 15
మీరు ఈ యాపిల్ ఐఫోన్‌ను ఇప్పటివరకు అతి తక్కువ ధరకు ఇంటికి తీసుకురావచ్చు. ఈ ఐఫోన్‌ను అమెజాన్ నుండి కొనుగోలు చేయచ్చు. ఆఫర్లపై ఈ ఫోన్ ధర రూ. 61,390. ఈ ఐఫోన్ రూ.79,990 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. దీని కొనుగోలుపై రూ.18,510 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు, మీకు రూ.1,841 క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఐఫోన్ 15 లో A16 బయోనిక్ చిప్ ఉంది. అలాగే 48MP కెమెరా, 6.1 డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

iPhone 16
గత సంవత్సరం లాంచ్ అయిన ఈ ఐఫోన్ మోడల్‌ను రూ. 68,780 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.74,900కి లిస్ట్ అయింది. దీనిని రూ.79,900 ధరకు విడుదల చేశారు. దీని కొనుగోలుపై, మీరు రూ. 6,120 తగ్గింపు,రూ. 4,000 కార్డ్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్‌లో సరికొత్త A18 బయోనిక్ చిప్, AI ఫీచర్ ఉన్నాయి.

 

iPhone 16 Pro
గత సంవత్సరం, ఈ ప్రో మోడల్ ఐఫోన్ రూ. 1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర దాదాపు రూ. 14,000 వరకు తగ్గింది. మీరు దీన్ని రూ. 1,05,355 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ధర రూ.1,12,900గా ఉంది. దీనితో పాటు, రూ.7,000 బంపర్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ A18 ప్రో బయోనిక్ చిప్‌తో వస్తుంది. అదనంగా, AI ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి: