iPhone 16e Pre-Booking: మొదలైన ప్రీ ఆర్డర్స్.. తక్కువ ధరకే ఐఫోన్ 16ఈ.. ఆఫర్ల అరాచకం..!

iPhone 16e Pre-Booking: టెక్ దిగ్గజం యాపిల్ సుధీర్ఘ నరీక్షణ తర్వాత తన చౌకైన ఐఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ ఫిబ్రవరి 19న iPhone 16eని పరిచయం చేసింది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే మీకో శుభవార్త ఉంది. iPhone 16e ప్రీ-బుకింగ్ ఈరోజు నుండి ప్రారంభమైంది. దీని సేల్ ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవుతుంది.
సరికొత్త ఐఫోన్ 16ఈని చౌకగా కొనుగోలు చేసేందుకు యాపిల్ గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. మీరు ముందస్తు ఆర్డర్ చేస్తే చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఆపిల్ వినియోగదారులకు EMIలో iPhone 16eని కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. కేవలం రూ.2 నుంచి 3 వేల వరకు ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయవచ్చు. EMI 24 నెలల పాటు ఉంటుంది. కంపెనీ మీకు 24 నెలల EMIపై రూ. 4000 తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది.
ఐఫోన్ 16e కొనుగోలుపై కంపెనీ వినియోగదారులకు గొప్ప ఆఫర్లను అందిస్తోంది. మీరు దీనిపై మూడు నెలల పాటు Apple Music, Apple TV+, Apple Arcade, Apple Fitness+ , Apple News+ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి అలాగే థర్డ్ పార్టీ రిటైలర్‌ల నుండి తాజా ఐఫోన్‌ను కొనుగోలు చేయగలుగుతారు.
కంపెనీ Apple iPhone 16eని బ్లాక్ అండ్ వైట్ అనే రెండు గొప్ప మ్యాట్ ఫినిష్ కలర్ ఆప్షన్‌లతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కోసం కంపెనీ వింటర్ బ్లూ, ఫుచ్‌సియా, లేక్ గ్రీన్, బ్లాక్ అండ్ వైట్ అనే ఐదు కలర్ ఆప్షన్‌లతో సిలికాన్ కేస్‌ను కూడా పరిచయం చేసింది. భారత మార్కెట్‌లో వీటి ధర దాదాపు రూ.3300 ఉంటుంది.
iPhone 16e మూడు స్టోరేజ్ వేరియంట్‌లతో 8GB వరకు RAM, 128GB స్టోరేజ్, 256GB స్టోరేజ్, 512GB స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. 128GB వేరియంట్ ధర రూ.59,990, 256GB మోడల్ ధర రూ.69,900, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,900.
iPhone 16e Specifications
ఐఫోన్ 16e అల్యూమినియం ఫ్రేమ్‌ని కలిగి ఉంది. దీనితో పాటు IP68 రేటింగ్ కూడా అందించారు. ఇందులో కంపెనీ 6.1 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేను ఇచ్చింది. 1200 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్, ఈ స్మార్ట్‌ఫోన్ Apple A18 బయోనిక్ చిప్‌సెట్‌తో వస్తుంది. iPhone 16e 8GB వరకు RAM, 12GB వరకు స్టోరేజ్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ 48 మెగాపిక్సెల్‌ల సింగిల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.