Winter Tour Spots: శీతాకాలాన్ని ఎంజాయ్ చెయ్యాలనుకునే వారికి ఈ ప్రదేశాలు సూపర్
మీకు శీతాకాలం అంటే ఇష్టమా. చల్లటి వాతావరణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాధించడానికి మన భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలు ఏంటి, అక్కడి విశేషాలేంటో ఓ లుక్కెయ్యండి.
Winter Tour Spots: మీకు శీతాకాలం అంటే ఇష్టమా. చల్లటి వాతావరణాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించాలని అనుకుంటున్నారా. చల్లటి చలికాలంలో వెచ్చటి ఒక గదిలో దుప్పటి వేసుకొని కూర్చొని, ఒక కప్పు వేడి సూప్‌ను సిప్ చేస్తూ, సినిమా చూస్తూ ఎంజాయ్ చేచేస్తే ఎంత బాగుంటుందో కదా. అదే సమయంలో కిటికీ వైపు చూస్తుంటే ఓ వైపు మంచు కురుస్తున్న దృశ్యాలు, మరోవైపు సముద్రం వద్ద కనిపించే సూర్యాస్తమయాలు, చల్లటి గాలిలో వేడివేడి స్నాక్స్ తింటూ సాయంత్రం వేళ అలా ఒక నడక వేస్తే ఆ ఆనందమే వేరు కదా. మరి మీరు ఇవ్వన్నీ ఆస్వాధించడానికి మన భారతదేశంలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. మరి ఆ ప్రదేశాలు ఏంటి, అక్కడి విశేషాలేంటో ఓ లుక్కెయ్యండి.
ఉత్తరాఖండ్‌లోని ఔలి అనేది ఓ చిన్న హిల్ స్టేషన్. భారతదేశంలోని ఉత్తమ శీతాకాలపు ప్రదేశాలలో ఇదీ ఒకటి. దీని చుట్టూ నందా దేవి, నీలకంఠ, మన పర్బత్ పర్వత శిఖరాలు ఎంతో ప్రసిద్ధి. దాదాపు ఏడాది పొడవునా పచ్చని లోయలతో ప్రకృతి రమణీయతను కలిగి ఉన్నప్పటికీ, శీతాకాలంలో ఇక్కడి ప్రకృతి సౌందర్యాలు అద్భుతంగా ఉంటాయి. మందపాటి మంచుతో కప్పబడి ఉండే ఈ ప్రాంతం మీకు అనేక స్కీ రిసార్ట్‌లు, హాలిడే మేకర్స్‌తో ఆహ్వానం పలుకుతుంది.
తవాంగ్ ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఒక ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్. నవంబర్ నుండి డిసెంబర్ మధ్య తవాంగ్ సందర్శించడానికి అత్యుత్తమ సమయం. తవాంగ్ ప్రాంతం ప్రకృతి రమణీయతతో పాటు, ఆధ్యాత్మిక చింతనలతో ఒక మాయా ప్రపంచంలా కనిపిస్తుంది. మంచుతో కప్పబడిన హిమాలయాలు, రంగురంగుల ప్రార్థనా జెండాలు, పురాతన మఠాలతో కూడిన లోయలు ఒక్కచోట చూపించే
అద్భుతమైన ప్రదేశం. జనవరిలో టోర్గ్యా ఫెస్టివల్ అలాగే ఫిబ్రవరిలో లోసార్ ఫెస్టివల్స్ ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించబడతాయి.
దక్షిణ భారతదేశంలో ఉన్న వారికి చేరువగా ఉండే అత్యుత్తమ ప్రదేశం గోవా. శీతాకాలంలో గోవాలో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం, నిర్మలమైన బీచ్‌లు, వివిధ రకాల వాటర్ స్పోర్ట్స్, రాత్రికి నైట్‌క్లబ్‌లు తెల్లవారుజాము వరకు ఉండే పార్టీలు ఇలా నాన్-స్టాప్ ఎంజాయ్మెంట్ కోసం గోవా అద్భుతమైన గమ్యస్థానం. అంతేకాకుండా ఈ సీజన్‌లో గోవా కార్నివాల్, గోవా ఫిల్మ్ ఫెస్టివల్, క్రిస్మస్ పార్టీల వేడుకలు ఒక రేంజ్‌లో జరుగుతాయనుకోండి. మరికెందుకు ఆలస్యం గోవా చూడాలనుకున్వవాళ్లు ఇప్పుడే బ్యాగ్స్ సర్దేసుకోండి.
శీతాకాలంలో చలిని ఆస్వాదించడంతో పాటు కాస్త వెచ్చదనాన్ని కోరుకుంటున్నారా? అయితే పశ్చిమ కనుమల మధ్య ఉన్న కలల ప్రదేశం వాయనాడ్‌కు వెళ్లండి. చలికాలంలో విహారయాత్రకు ఈ హిల్ స్టేషన్ అద్భుతమైన గమ్యస్థానం. కేరళలో ఉన్న ఈ సుందరమైన పట్టణం మీ సెలవులను పూర్తిగా సంతృప్తి పరుస్తాయి. ఇక్కడ కన్నులు కోరుకునే ప్రకృతి సౌందర్యం చాలా ఉంది. అంతేకాకుండా ఇక్కడి ఆహారం, సంస్కృతి, చరిత్ర, మిమ్మల్ని మరింత ఆనందింపజేసే అంశాలు.
ఇదీ చదవండి: మిస్టరీగా మిగిలిన గోల్డెన్ రాక్.. మహిళలు ముడితే అంతే సంగతి..!